Isaiah · chapter 32 · verse 4
Isaiah 32:4 in Telugu
చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
Chanchalula manassu jnyaanamu grahinchunu nattivaari naaluka spashtamugaa maatalaadunu.
Isaiah 32:4 in English
- King James Version (KJV)
- The heart also of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.
- World English Bible (WEB)
- The heart of the rash will understand knowledge, and the tongue of the stammerers will be ready to speak plainly.
- American Standard Version (ASV)
- And the heart of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.
- Bible in Basic English (BBE)
- The man of sudden impulses will become wise in heart, and he whose tongue is slow will get the power of talking clearly.
- Darby Translation (DBY)
- and the heart of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.
- Webster's Bible (WBS)
- The heart also of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.
- Young's Literal Translation (YLT)
- And the heart of those hastened Understandeth to know, And the tongue of stammerers hasteth to speak clearly.
Read in context
- 2మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
- 3చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.
- 4చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
- 5మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.
- 6మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.
Cross references
- Isaiah 29:24 యెషయా 29:24చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.
- Luke 21:14–15 లూకా 21:14–15కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
- Nehemiah 8:8–12 నెహెమ్యా 8:8–12ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులునుమీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెనుపదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖ పడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు. ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖ పడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.
- Acts 6:7 అపొస్తలుల కార్యములు 6:7దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
- Acts 26:9–11 అపొస్తలుల కార్యములు 26:9–11నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
- Acts 2:4–12 అపొస్తలుల కార్యములు 2:4–12అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
- Matthew 16:17 మత్తయి 16:17అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.
- Song of Solomon 7:9 పరమగీతము 7:9నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.
- Exodus 4:11 నిర్గమకాండము 4:11యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
- Matthew 11:25 మత్తయి 11:25ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
- Acts 4:13 అపొస్తలుల కార్యములు 4:13వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
- Galatians 1:23 గలతీయులకు 1:23మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,