Isaiah · chapter 37 · verse 11
Isaiah 37:11 in Telugu
అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?
Ashshooruraajulu sakaladeshamu lanu bottigaa nashimpajesina sangati neeku vinabadinadi gadaa; neevumaatramu tappinchukonduvaa?
Isaiah 37:11 in English
- King James Version (KJV)
- Behold, thou hast heard what the kings of Assyria have done to all lands by destroying them utterly; and shalt thou be delivered?
- World English Bible (WEB)
- Behold, you have heard what the kings of Assyria have done to all lands, by destroying them utterly. Shall you be delivered?
- American Standard Version (ASV)
- Behold, thou hast heard what the kings of Assyria have done to all lands, by destroying them utterly: and shalt thou be delivered?
- Bible in Basic English (BBE)
- No doubt the story has come to your ears of what the kings of Assyria have done to all lands, putting them to the curse: and will you be kept safe from their fate?
- Darby Translation (DBY)
- Behold, thou hast heard what the kings of Assyria have done to all countries, destroying them utterly; and shalt thou be delivered?
- Webster's Bible (WBS)
- Behold, thou hast heard what the kings of Assyria have done to all lands by destroying them utterly; and shalt thou be delivered?
- Young's Literal Translation (YLT)
- Lo, thou hast heard that which the kings of Asshur have done to all the lands — to devote them — and thou art delivered!
Read in context
- 9అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.
- 10యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.
- 11అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?
- 12నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?
- 13హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి
Cross references
- Isaiah 36:18–20 యెషయా 36:18–20ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను? అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.
- Isaiah 10:7–14 యెషయా 10:7–14అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా? కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును. అతడునేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను చున్నానని అనుకొనును.
- 2 Kings 17:4–6 2 రాజులు 17:4–6అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను. అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను. హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.
- Isaiah 14:17 యెషయా 14:17భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా?
- 2 Kings 18:33–35 2 రాజులు 18:33–35ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమా యెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.
- Isaiah 37:18–19 యెషయా 37:18–19యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.