Isaiah · chapter 38 · verse 11
Isaiah 38:11 in Telugu
యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.
Yehovaanu, sajeevula deshamuna yehovaanu choodakapovudunu. Mrutula lokanivaasinai ikanu manushyulanu kaanaka povudunani nenanukontini.
Isaiah 38:11 in English
- King James Version (KJV)
- I said, I shall not see the LORD, [even] the LORD, in the land of the living: I shall behold man no more with the inhabitants of the world.
- World English Bible (WEB)
- I said, “I won’t see the LORD, the LORD in the land of the living. I will see man no more with the inhabitants of the world.
- American Standard Version (ASV)
- I said, I shall not see Jehovah, [even] Jehovah in the land of the living: I shall behold man no more with the inhabitants of the world.
- Bible in Basic English (BBE)
- I said, I will not see the Lord, even the Lord in the land of the living: I will not see man again or those living in the world.
- Darby Translation (DBY)
- I said, I shall not see Jah, Jah in the land of the living. With those who dwell where all has ceased to be, I shall behold man no more.
- Webster's Bible (WBS)
- I said, I shall not see the LORD, [even] the LORD, in the land of the living: I shall behold man no more with the inhabitants of the world.
- Young's Literal Translation (YLT)
- I said, I do not see Jah — Jah! In the land of the living, I do not behold man any more, With the inhabitants of the world.
Read in context
- 9యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.
- 10నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.
- 11యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.
- 12నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.
- 13ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు
Cross references
- Psalm 27:13 కీర్తనలు 27:13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
- Psalm 116:8–9 కీర్తనలు 116:8–9మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
- Psalm 6:4–5 కీర్తనలు 6:4–5యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము. మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?
- Job 35:14–15 యోబు 35:14–15ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
- Psalm 31:22 కీర్తనలు 31:22భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనలధ్వని నాలకించితివి.
- Ecclesiastes 9:5–6 ప్రసంగి 9:5–6బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.