Psalms · chapter 27 · verse 13
Psalm 27:13 in Telugu
సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
Sajeevula deshamuna nenu yehovaa dayanu pondudunanna nammakamu naaku leniyedala nenemavudunu? Yehovaa koraku kanipettukoni yundumu
Psalm 27:13 in English
- King James Version (KJV)
- [I had fainted], unless I had believed to see the goodness of the LORD in the land of the living.
- World English Bible (WEB)
- I am still confident of this: I will see the goodness of the LORD in the land of the living.
- American Standard Version (ASV)
- [I had fainted], unless I had believed to see the goodness of Jehovah In the land of the living.
- Bible in Basic English (BBE)
- I had almost given up my hope of seeing the blessing of the Lord in the land of the living.
- Darby Translation (DBY)
- Unless I had believed to see the goodness of Jehovah in the land of the living...!
- Webster's Bible (WBS)
- [I had fainted] , unless I had believed to see the goodness of the LORD in the land of the living.
- Young's Literal Translation (YLT)
- I had not believed to look on the goodness of Jehovah In the land of the living!
Read in context
- 11యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.
- 12అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
- 13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
- 14ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.
Cross references
- 2 Corinthians 4:16 2 కొరింథీయులకు 4:16కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
- Psalm 142:5 కీర్తనలు 142:5యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
- 2 Corinthians 4:8–14 2 కొరింథీయులకు 4:8–14ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొని పోవుచున్నాము. ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి. కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,
- Psalm 56:3 కీర్తనలు 56:3నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.
- Psalm 56:13 కీర్తనలు 56:13నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.
- Psalm 31:19 కీర్తనలు 31:19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
- Psalm 42:5 కీర్తనలు 42:5నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
- Psalm 116:9–11 కీర్తనలు 116:9–11సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను. నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
- Ephesians 2:8 ఎఫెసీయులకు 2:8మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
- Job 28:13 యోబు 28:13నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.
- 2 Corinthians 4:1 2 కొరింథీయులకు 4:1కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
- Jeremiah 11:19 యిర్మీయా 11:19అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.