Isaiah · chapter 5 · verse 28
Isaiah 5:28 in Telugu
వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును
Vaari baanamulu vaadigalavi vaari vindlanniyu ekku pettabadiyunnavi vaari gurramula dekkalu chekumukiraallato samaana mulu vaari rathachakramulu sudigaali tiriginatlu tirugunu
Isaiah 5:28 in English
- King James Version (KJV)
- Whose arrows [are] sharp, and all their bows bent, their horses’ hoofs shall be counted like flint, and their wheels like a whirlwind:
- World English Bible (WEB)
- whose arrows are sharp, and all their bows bent. Their horses’ hoofs will be like flint, and their wheels like a whirlwind.
- American Standard Version (ASV)
- whose arrows are sharp, and all their bows bent; their horses’ hoofs shall be accounted as flint, and their wheels as a whirlwind:
- Bible in Basic English (BBE)
- Their arrows are sharp, and every bow is bent: the feet of their horses are like rock, and their wheels are like a rushing storm.
- Darby Translation (DBY)
- their arrows are sharp, and all their bows bent; their horses' hoofs are reckoned as the flint, and their wheels as a whirlwind.
- Webster's Bible (WBS)
- Whose arrows [are] sharp, and all their bows bent, their horses' hoofs shall be counted like flint, and their wheels like a whirlwind:
- Young's Literal Translation (YLT)
- Whose arrows [are] sharp, and all its bows bent, Hoofs of its horses as flint have been reckoned, And its wheels as a hurricane!
Read in context
- 26ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.
- 27వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.
- 28వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును
- 29ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.
- 30వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జనచేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.
Cross references
- Psalm 45:5 కీర్తనలు 45:5నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.
- Ezekiel 21:9–11 యెహెజ్కేలు 21:9–11నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచ బడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.
- Nahum 2:3–4 నహూము 2:3–4ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళ దారుమయమైన యీటెలు ఆడు చున్నవి; వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,
- Micah 4:13 మీకా 4:13సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్టించుదును.
- Jeremiah 5:16 యిర్మీయా 5:16వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలా ఢ్యులు,
- Nahum 3:2 నహూము 3:2సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడు చున్నవి.
- Isaiah 21:1 యెషయా 21:1సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.
- Psalm 120:4 కీర్తనలు 120:4తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
- Psalm 7:12–13 కీర్తనలు 7:12–13ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
- Jeremiah 47:3 యిర్మీయా 47:3వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు.
- Judges 5:22 న్యాయాధిపతులు 5:22గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.