Isaiah · chapter 5 · verse 29
Isaiah 5:29 in Telugu
ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.
Aadusinhamu garjinchinatlu vaaru garjinchuduru kodamasinhamu garjinchinatlu garjanacheyuchu vetanu pattukoni addamemiyu lekunda daanini ettukoni povuduru vidipimpagalavaadevadunu undadu.
Isaiah 5:29 in English
- King James Version (KJV)
- Their roaring [shall be] like a lion, they shall roar like young lions: yea, they shall roar, and lay hold of the prey, and shall carry [it] away safe, and none shall deliver [it].
- World English Bible (WEB)
- Their roaring will be like a lioness. They will roar like young lions. Yes, they shall roar, and seize their prey and carry it off, and there will be no one to deliver.
- American Standard Version (ASV)
- their roaring shall be like a lioness, they shall roar like young lions; yea, they shall roar, and lay hold of the prey, and carry it away safe, and there shall be none to deliver.
- Bible in Basic English (BBE)
- The sound of their armies will be like the voice of a lion, and their war-cry like the noise of young lions: with loud cries they will come down on their food and will take it away safely, and there will be no one to take it out of their hands.
- Darby Translation (DBY)
- Their roaring is like a lioness, they roar as the young lions; yea, they growl, and snatch the prey, and carry it away safe, and there is none to deliver;
- Webster's Bible (WBS)
- Their roaring [shall be] like a lion, they shall roar like young lions: yes, they shall roar, and lay hold of the prey, and shall carry [it] away safe, and none shall deliver [it] .
- Young's Literal Translation (YLT)
- Its roaring [is] like a lioness, It roareth like young lions, And it howleth, and seizeth prey, And carrieth away safely, and there is none delivering.
Read in context
- 27వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.
- 28వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును
- 29ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.
- 30వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జనచేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.
Cross references
- Isaiah 42:22 యెషయా 42:22అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు వారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు.
- Isaiah 49:24–25 యెషయా 49:24–25బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన గలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.
- Micah 5:8 మీకా 5:8యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
- Zechariah 11:3 జెకర్యా 11:3గొఱ్ఱె బోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహ ముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను.
- Isaiah 31:4 యెషయా 31:4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.
- Hosea 11:10 హోషేయ 11:10వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.
- Jeremiah 4:7 యిర్మీయా 4:7పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి యున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.
- Psalm 50:22 కీర్తనలు 50:22దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
- Jeremiah 49:19 యిర్మీయా 49:19చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?
- Jeremiah 51:38 యిర్మీయా 51:38వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపెట్టుదురు.
- Zephaniah 3:3 జెఫన్యా 3:3దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.
- Amos 3:8 ఆమోసు 3:8సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువా డెవడు?