Isaiah · chapter 51 · verse 22
Isaiah 51:22 in Telugu
నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.
Nee prabhuvagu yehovaa tana janulanimittamu vyaajyemaadu nee devudu eelaagu selavichchuchunnaadu idigo toolipadajeyu paatranu naa krodha paatranu nee chetilonundi teesivesiyunnaanu neevikanu daanilonidi traagavu.
Isaiah 51:22 in English
- King James Version (KJV)
- Thus saith thy Lord the LORD, and thy God [that] pleadeth the cause of his people, Behold, I have taken out of thine hand the cup of trembling, [even] the dregs of the cup of my fury; thou shalt no more drink it again:
- World English Bible (WEB)
- Your Lord GOD, your God who pleads the cause of his people, says, “Behold, I have taken out of your hand the cup of staggering, even the bowl of the cup of my wrath. You will not drink it any more.
- American Standard Version (ASV)
- Thus saith thy Lord Jehovah, and thy God that pleadeth the cause of his people, Behold, I have taken out of thy hand the cup of staggering, even the bowl of the cup of my wrath; thou shalt no more drink it again:
- Bible in Basic English (BBE)
- This is the word of the Lord your master, even your God who takes up the cause of his people: See, I have taken out of your hand the cup which overcomes, even the cup of my wrath; it will not again be given to you:
- Darby Translation (DBY)
- thus saith thy Lord, Jehovah, and thy God, who pleadeth the cause of his people, Behold, I take out of thy hand the cup of bewilderment, the goblet-cup of my fury; thou shalt no more drink it again:
- Webster's Bible (WBS)
- Thus saith thy Lord Jehovah, and thy God [that] pleadeth the cause of his people, Behold, I have taken out of thy hand the cup of trembling, [even] the dregs of the cup of my fury; thou shalt no more drink it again:
- Young's Literal Translation (YLT)
- Thus said thy Lord Jehovah, and thy God, He pleadeth [for] his people: 'Lo, I have taken out of thy hand the cup of trembling, The goblet, the cup of My fury, Thou dost not add to drink it any more.
Read in context
- 20యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.
- 21ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము.
- 22నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.
- 23నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.
Cross references
- Proverbs 22:23 సామెతలు 22:23యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచు కొనును.
- Isaiah 62:8 యెషయా 62:8యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.
- Jeremiah 50:34 యిర్మీయా 50:34వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.
- Isaiah 51:17 యెషయా 51:17యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.
- Isaiah 49:25 యెషయా 49:25యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.
- Psalm 35:1 కీర్తనలు 35:1యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.
- Joel 3:2 యోవేలు 3:2అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యె మాడుదును.
- Micah 7:9 మీకా 7:9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
- 1 Samuel 25:39 1 సమూయేలు 25:39నాబాలు చనిపోయెనని దావీదు వినియెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను.
- Jeremiah 51:36 యిర్మీయా 51:36యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.
- Ezekiel 39:29 యెహెజ్కేలు 39:29అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Isaiah 54:7–9 యెషయా 54:7–9నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
Original words (Hebrew)
- saith · H559אָמַר ʼâmar
- Lord · H113אָדוֹן ʼâdôwn
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- pleadeth · H7378רִיב rîyb
- people · H5971עַם ʻam
- out · H3947לָקַח lâqach
- hand · H3027יָד yâd
- cup · H3563כּוֹס kôwç
- trembling · H8653תַּרְעֵלָה tarʻêlâh
- dregs · H6907קֻבַּעַת qubbaʻath
- cup · H3563כּוֹס kôwç
- fury · H2534חֵמָה chêmâh
- more · H3254יָסַף yâçaph
- again · H8354שָׁתָה shâthâh