Isaiah · chapter 52 · verse 11
Isaiah 52:11 in Telugu
పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
Povudi povudi achchatanundi velludi apavitramaina denini muttakudi daaniyoddanundi tolagipovudi yehovaa sevopakaranamulanu moyuvaaralaaraa, mimmunu meeru pavitraparachukonudi
Isaiah 52:11 in English
- King James Version (KJV)
- Depart ye, depart ye, go ye out from thence, touch no unclean [thing;] go ye out of the midst of her; be ye clean, that bear the vessels of the LORD.
- World English Bible (WEB)
- Depart! Depart! Go out from there! Touch no unclean thing! Go out from among her! Cleanse yourselves, you who carry the LORD’s vessels.
- American Standard Version (ASV)
- Depart ye, depart ye, go ye out from thence, touch no unclean thing; go ye out of the midst of her; cleanse yourselves, ye that bear the vessels of Jehovah.
- Bible in Basic English (BBE)
- Away! away! go out from there, touching no unclean thing; go out from among her; be clean, you who take up the vessels of the Lord.
- Darby Translation (DBY)
- — Depart, depart, go out from thence, touch not what is unclean; go out of the midst of her, be ye clean, that bear the vessels of Jehovah.
- Webster's Bible (WBS)
- Depart ye, depart ye, go ye out from thence, touch no unclean [thing] ; go ye out of the midst of her; be ye clean, that bear the vessels of the LORD.
- Young's Literal Translation (YLT)
- Turn aside, turn aside, go out thence, The unclean touch not, go out from her midst, Be ye pure, who are bearing the weapons of Jehovah.
Read in context
- 9యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూషలేమును విమోచించెను.
- 10సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.
- 11పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
- 12మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును
- 13ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.
Cross references
- 2 Corinthians 6:17 2 కొరింథీయులకు 6:17కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
- Zechariah 2:6–7 జెకర్యా 2:6–7ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు. బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
- Ephesians 5:11 ఎఫెసీయులకు 5:11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
- Isaiah 48:20 యెషయా 48:20బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.
- Leviticus 10:3 లేవీయకాండము 10:3అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;
- Isaiah 1:16 యెషయా 1:16మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.
- Ezra 1:7–11 ఎజ్రా 1:7–11మరియు నెబు కద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవ తలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉప కరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను. బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోనుచరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.
- Haggai 2:13–14 హగ్గయి 2:13–14శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగు ననిరి. అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియ లన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.
- Leviticus 5:2–3 లేవీయకాండము 5:2–3మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును.
- Jeremiah 50:8 యిర్మీయా 50:8బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి.
- Ezekiel 44:23 యెహెజ్కేలు 44:23ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు
- 1 Peter 1:14–16 1 పేతురు 1:14–16నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.