Isaiah · chapter 57 · verse 11
Isaiah 57:11 in Telugu
ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుట లేదు?
Evaniki jadisi bhayapadinanduna aa sangati manaskarimpakapotivi? Neevu kallalaadi nannu jnyaapakamu chesikonakapotivi bahukaalamunundi nenu maunamugaanundinandu nane gadaa neevu naaku bhayapaduta ledu?
Isaiah 57:11 in English
- King James Version (KJV)
- And of whom hast thou been afraid or feared, that thou hast lied, and hast not remembered me, nor laid [it] to thy heart? have not I held my peace even of old, and thou fearest me not?
- World English Bible (WEB)
- “Whom have you dreaded and feared, so that you lie, and have not remembered me, nor laid it to your heart? Haven’t I held my peace for a long time, and you don’t fear me?
- American Standard Version (ASV)
- And of whom hast thou been afraid and in fear, that thou liest, and hast not remembered me, nor laid it to thy heart? have not I held my peace even of long time, and thou fearest me not?
- Bible in Basic English (BBE)
- And of whom were you in fear, so that you were false, and did not keep me in mind, or give thought to it? Have I not been quiet, keeping myself secret, and so you were not in fear of me?
- Darby Translation (DBY)
- And of whom hast thou been afraid or feared, that thou hast lied, and hast not remembered me, nor taken it to heart? Have not I even of long time held my peace, and thou fearest me not?
- Webster's Bible (WBS)
- And of whom hast thou been afraid or feared, that thou hast lied, and hast not remembered me, nor laid [it] to thy heart? have not I held my peace even of old, and thou fearest me not?
- Young's Literal Translation (YLT)
- And of whom hast thou been afraid, and fearest, That thou liest, and Me hast not remembered? Thou hast not laid [it] to thy heart, Am not I silent, even from of old? And Me thou fearest not?
Read in context
- 9నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి
- 10నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.
- 11ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుట లేదు?
- 12నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును.
- 13నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.
Cross references
- Isaiah 51:12–13 యెషయా 51:12–13నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
- Proverbs 29:25 సామెతలు 29:25భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
- Psalm 50:21 కీర్తనలు 50:21ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
- Jeremiah 3:21 యిర్మీయా 3:21ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.
- Isaiah 59:3–4 యెషయా 59:3–4మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
- Isaiah 26:10 యెషయా 26:10దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.
- Jeremiah 2:32 యిర్మీయా 2:32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
- Ecclesiastes 8:11 ప్రసంగి 8:11దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు.
- Isaiah 30:9 యెషయా 30:9వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు
- Jeremiah 9:3–5 యిర్మీయా 9:3–5విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.
- Hosea 11:12 హోషేయ 11:12ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించి యున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.
- Ezekiel 13:22 యెహెజ్కేలు 13:22మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.