Ecclesiastes · chapter 8 · verse 11
Ecclesiastes 8:11 in Telugu
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు.
Dushkriyaku tagina shiksha sheeghramugaa kalugakapovutachoochi manushyulu bhayamuvidichi hrudayapoorvakamugaa dushkriyalu cheyuduru.
Ecclesiastes 8:11 in English
- King James Version (KJV)
- Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
- World English Bible (WEB)
- Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
- American Standard Version (ASV)
- Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
- Bible in Basic English (BBE)
- Because punishment for an evil work comes not quickly, the minds of the sons of men are fully given to doing evil.
- Darby Translation (DBY)
- Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the children of men is fully set in them to do evil.
- Webster's Bible (WBS)
- Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
- Young's Literal Translation (YLT)
- Because sentence hath not been done [on] an evil work speedily, therefore the heart of the sons of man is full within them to do evil.
Read in context
- 9సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.
- 10మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థులవలన మరువ బడియుండుటయు నేను చూచితిని; ఇదియు వ్యర్థమే.
- 11దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు.
- 12పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమ ముగా నుందురనియు,
- 13భక్తిహీనులు దేవుని సన్నిధిని భయ పడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును.
Cross references
- Isaiah 26:10 యెషయా 26:10దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.
- Psalm 50:21–22 కీర్తనలు 50:21–22ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
- Romans 2:4–5 రోమీయులకు 2:4–5లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
- 2 Peter 3:3–10 2 పేతురు 3:3–10అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
- Matthew 24:49–50 మత్తయి 24:49–50తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.
- Psalm 10:6 కీర్తనలు 10:6మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు
- Job 21:11–15 యోబు 21:11–15వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
- Jeremiah 48:11 యిర్మీయా 48:11మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
- Exodus 8:15 నిర్గమకాండము 8:15ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
- Isaiah 5:18–19 యెషయా 5:18–19భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము
- Jeremiah 42:15 యిర్మీయా 42:15యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లినయెడల
- Isaiah 57:11 యెషయా 57:11ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుట లేదు?