Isaiah · chapter 63 · verse 7
Isaiah 63:7 in Telugu
యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.
Yehovaa manaku chesinavaatannitinibatti yehovaa krupaatishayamunu yehovaa stotramu lanu gaanamuchetunu. Tana vaatsalyamunubattiyu krupaabaahulyamunu battiyu ishraayeluyokka vanshasthulaku aayana choopina mahaakanikaramunu nenu prakatana chesedanu.
Isaiah 63:7 in English
- King James Version (KJV)
- I will mention the lovingkindnesses of the LORD, [and] the praises of the LORD, according to all that the LORD hath bestowed on us, and the great goodness toward the house of Israel, which he hath bestowed on them according to his mercies, and according to the multitude of his lovingkindnesses.
- World English Bible (WEB)
- I will tell of the loving kindnesses of the LORD and the praises of the LORD, according to all that the LORD has given to us, and the great goodness toward the house of Israel, which he has given to them according to his mercies, and according to the multitude of his loving kindnesses.
- American Standard Version (ASV)
- I will make mention of the lovingkindnesses of Jehovah, [and] the praises of Jehovah, according to all that Jehovah hath bestowed on us, and the great goodness toward the house of Israel, which he hath bestowed on them according to his mercies, and according to the multitude of his lovingkindnesses.
- Bible in Basic English (BBE)
- I will give news of the mercies of the Lord, and his great acts, even all the things the Lord has done for us, in his great grace to the house of Israel; even all he has done for us in his unnumbered mercies.
- Darby Translation (DBY)
- I will record the loving-kindnesses of Jehovah, the praises of Jehovah, according to all that Jehovah hath bestowed upon us, and the great goodness toward the house of Israel which he hath bestowed upon them according to his mercies, and according to the multitude of his loving-kindnesses.
- Webster's Bible (WBS)
- I will mention the loving-kindnesses of the LORD, [and] the praises of the LORD, according to all that the LORD hath bestowed on us, and the great goodness towards the house of Israel, which he hath bestowed on them according to his mercies, and according to the multitude of his loving-kindnesses.
- Young's Literal Translation (YLT)
- The kind acts of Jehovah I make mention of, The praises of Jehovah, According to all that Jehovah hath done for us, And the abundance of the goodness to the house of Israel, That He hath done for them, According to His mercies, And according to the abundance of His kind acts.
Read in context
- 5నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.
- 6కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.
- 7యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.
- 8వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.
- 9వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
Cross references
- Ephesians 2:4 ఎఫెసీయులకు 2:4అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.
- Psalm 86:5 కీర్తనలు 86:5ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.
- Psalm 86:15 కీర్తనలు 86:15ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు
- Ephesians 1:6–7 ఎఫెసీయులకు 1:6–7మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
- Romans 2:4 రోమీయులకు 2:4లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
- Ezekiel 16:6–14 యెహెజ్కేలు 16:6–14అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను. మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీమీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి. నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరి పూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశం సించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Psalm 51:1 కీర్తనలు 51:1దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
- 1 Kings 8:66 1 రాజులు 8:66ఎనిమిదవ దినమున అతడు జను లకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జను లకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లి పోయిరి.
- Psalm 136:1–26 కీర్తనలు 136:1–26యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును. ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును. అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
- Psalm 107:8 కీర్తనలు 107:8ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక
- Nehemiah 9:35 నెహెమ్యా 9:35వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి.
- Nehemiah 9:31 నెహెమ్యా 9:31అయితే నీవు మహోప కారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికర ములుగల దేవుడవై యున్నావు.
Original words (Hebrew)
- mention · H2142זָכַר zâkar
- lovingkindnesses · H2617חֵסֵד chêçêd
- praises · H8416תְּהִלָּה tᵉhillâh
- bestowed · H1580גָּמַל gâmal
- great · H7227רַב rab
- goodness · H2898טוּב ṭûwb
- house · H1004בַּיִת bayith
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- bestowed · H1580גָּמַל gâmal
- mercies · H7356רַחַם racham
- multitude · H7230רֹב rôb
- lovingkindnesses · H2617חֵסֵד chêçêd