Isaiah · chapter 7 · verse 20
Isaiah 7:20 in Telugu
ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.
Aa dinamuna yehovaa nadi (yooprateesu) addari nundi kooliki vachchu mangalakattichetanu, anagaa ashshooru raaju chetanu talavendrukalanu kaallavendrukalanu kshauramu cheyinchunu, adi gaddamukoodanu geechiveyunu.
Isaiah 7:20 in English
- King James Version (KJV)
- In the same day shall the Lord shave with a razor that is hired, [namely], by them beyond the river, by the king of Assyria, the head, and the hair of the feet: and it shall also consume the beard.
- World English Bible (WEB)
- In that day the Lord will shave with a razor that is hired in the parts beyond the River, even with the king of Assyria, the head and the hair of the feet; and it shall also consume the beard.
- American Standard Version (ASV)
- In that day will the Lord shave with a razor that is hired in the parts beyond the River, [even] with the king of Assyria, the head and the hair of the feet; and it shall also consume the beard.
- Bible in Basic English (BBE)
- In that day will the Lord take away the hair of the head and of the feet, as well as the hair of the face, with a blade got for a price from the other side of the River; even with the king of Assyria.
- Darby Translation (DBY)
- In that day will the Lord, with a razor which is hired beyond the river, with the king of Assyria, shave the head and the hair of the feet, yea, the beard also will it take away.
- Webster's Bible (WBS)
- In the same day will the LORD shave with a razor that is hired, [namely] , by them beyond the river, by the king of Assyria, the head, and the hair of the feet: and it shall also consume the beard.
- Young's Literal Translation (YLT)
- In that day doth the Lord shave, By a razor that is hired beyond the river, By the king of Asshur, The head, and the hair of the feet, Yea, also the beard it consumeth.
Read in context
- 18ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.
- 19అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.
- 20ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.
- 21ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱె లను పెంచుకొనగా
- 22అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.
Cross references
- Isaiah 8:7 యెషయా 8:7కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.
- Isaiah 10:15 యెషయా 10:15గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?
- Ezekiel 5:1–4 యెహెజ్కేలు 5:1–4మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము; పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.
- Ezekiel 29:18 యెహెజ్కేలు 29:18నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.
- Jeremiah 27:6–7 యిర్మీయా 27:6–7ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.
- Isaiah 10:5–6 యెషయా 10:5–6అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
- Isaiah 9:14–17 యెషయా 9:14–17కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మింగివేయబడు దురు. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి ¸యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
- Isaiah 24:1–2 యెషయా 24:1–2ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలుగును.
- 2 Kings 18:13–16 2 రాజులు 18:13–16రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశ మందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపినావలన తప్పు వచ్చినది;నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియ మించెను. కావున హిజ్కియా యెహోవా మందిర మందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.
- 2 Chronicles 28:20–21 2 దినవృత్తాంతములు 28:20–21అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు. ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.
- Ezekiel 29:20 యెహెజ్కేలు 29:20తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
- 2 Kings 16:7–8 2 రాజులు 16:7–8ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా
Original words (Hebrew)
- day · H3117יוֹם yôwm
- Lord · H136אֲדֹנָי ʼĂdônây
- shave · H1548גָּלַח gâlach
- razor · H8593תַּעַר taʻar
- hired · H7917שְׂכִירָה sᵉkîyrâh
- beyond · H5676עֵבֶר ʻêber
- river · H5104נָהָר nâhâr
- king · H4428מֶלֶךְ melek
- Assyria · H804אַשּׁוּר ʼAshshûwr
- head · H7218רֹאשׁ rôʼsh
- hair · H8181שֵׂעָר sêʻâr
- feet · H7272רֶגֶל regel
- consume · H5595סָפָה çâphâh
- beard · H2206זָקָן zâqân