James · chapter 5 · verse 5
James 5:5 in Telugu
మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.
Meeru bhoomimeeda sukhamugaa jeevinchi bhogaasaktulai vadhadinamunandu mee hrudayamulanu poshinchukontiri.
James 5:5 in English
- King James Version (KJV)
- Ye have lived in pleasure on the earth, and been wanton; ye have nourished your hearts, as in a day of slaughter.
- World English Bible (WEB)
- You have lived in luxury on the earth, and taken your pleasure. You have nourished your hearts as in a day of slaughter.
- American Standard Version (ASV)
- Ye have lived delicately on the earth, and taken your pleasure; ye have nourished your hearts in a day of slaughter.
- Bible in Basic English (BBE)
- You have been living delicately on earth and have taken your pleasure; you have made your hearts fat for a day of destruction.
- Darby Translation (DBY)
- Ye have lived luxuriously on the earth and indulged yourselves; ye have nourished your hearts [as] in a day of slaughter;
- Webster's Bible (WBS)
- Ye have lived in pleasure on the earth, and been wanton; ye have nourished your hearts, as in a day of slaughter.
- Young's Literal Translation (YLT)
- ye did live in luxury upon the earth, and were wanton; ye did nourish your hearts, as in a day of slaughter;
Read in context
- 3మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.
- 4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- 5మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.
- 6మీరు నీతి మంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.
- 7సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా
Cross references
- 1 Timothy 5:6 1 తిమోతికి 5:6సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును.
- Luke 16:25 లూకా 16:25అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.
- Luke 16:19 లూకా 16:19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
- Amos 6:1 ఆమోసు 6:1సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనవారికి శ్రమ
- Jeremiah 12:3 యిర్మీయా 12:3యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచు చున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱెలనువలె వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము.
- Revelation 19:17–18 ప్రకటన 19:17–18మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
- Job 21:11–15 యోబు 21:11–15వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
- Revelation 18:7 ప్రకటన 18:7అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి
- Jeremiah 25:34 యిర్మీయా 25:34మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.
- 1 Samuel 25:36 1 సమూయేలు 25:36అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.
- Isaiah 22:13 యెషయా 22:13రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు
- Isaiah 5:11–12 యెషయా 5:11–12మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.