Jeremiah · chapter 11 · verse 7
Jeremiah 11:7 in Telugu
ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని
Aiguptulonundi mee pitarulanu rappinchina dinamu modalukoni netivaraku nenu gattigaanu khanditamugaanu cheppuchu vachchitini; naa maata vinudi ani pendalakada lechi cheppuchu vachchitini
Jeremiah 11:7 in English
- King James Version (KJV)
- For I earnestly protested unto your fathers in the day [that] I brought them up out of the land of Egypt, [even] unto this day, rising early and protesting, saying, Obey my voice.
- World English Bible (WEB)
- For I earnestly protested to your fathers in the day that I brought them up out of the land of Egypt, even to this day, rising early and protesting, saying, “Obey my voice.”
- American Standard Version (ASV)
- For I earnestly protested unto your fathers in the day that I brought them up out of the land of Egypt, even unto this day, rising early and protesting, saying, Obey my voice.
- Bible in Basic English (BBE)
- For I gave certain witness to your fathers on the day when I took them up out of the land of Egypt, and even to this day, getting up early and witnessing and saying, Give ear to my voice.
- Darby Translation (DBY)
- For I earnestly protested unto your fathers, in the day that I brought them up out of the land of Egypt, unto this day, rising early and protesting, saying, Hearken unto my voice.
- Webster's Bible (WBS)
- For I earnestly protested to your fathers in the day [that] I brought them out of the land of Egypt, [even] to this day, rising early and protesting, saying, Obey my voice.
- Young's Literal Translation (YLT)
- For I certainly testified against your fathers, In the day of My bringing them up out of the land of Egypt — till this day, Rising early and testifying, saying, Hearken to My voice,
Read in context
- 5అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని.
- 6యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా - నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుముమీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.
- 7ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని
- 8అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారి కాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటిననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి నన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.
- 9మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.
Cross references
- 2 Chronicles 36:15 2 దినవృత్తాంతములు 36:15వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
- Exodus 15:26 నిర్గమకాండము 15:26మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగ జేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
- 1 Samuel 8:9 1 సమూయేలు 8:9అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.
- Exodus 23:21–22 నిర్గమకాండము 23:21–22ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.
- Ephesians 4:17 ఎఫెసీయులకు 4:17కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
- Deuteronomy 12:32 ద్వితీయోపదేశకాండము 12:32నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.
- Deuteronomy 8:6 ద్వితీయోపదేశకాండము 8:6ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను.
- Jeremiah 35:15 యిర్మీయా 35:15మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటిం చితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి
- Deuteronomy 10:12–13 ద్వితీయోపదేశకాండము 10:12–13కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయ పడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
- Jeremiah 25:4 యిర్మీయా 25:4మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని,
- Jeremiah 7:23–25 యిర్మీయా 7:23–25ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.
- Deuteronomy 30:20 ద్వితీయోపదేశకాండము 30:20నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.
Original words (Hebrew)
- earnestly · H5749עוּד ʻûwd
- protested · H5749עוּד ʻûwd
- fathers · H1אָב ʼâb
- day · H3117יוֹם yôwm
- up · H5927עָלָה ʻâlâh
- land · H776אֶרֶץ ʼerets
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- day · H3117יוֹם yôwm
- early · H7925שָׁכַם shâkam
- protesting · H5749עוּד ʻûwd
- saying · H559אָמַר ʼâmar
- Obey · H8085שָׁמַע shâmaʻ
- voice · H6963קוֹל qôwl