Jeremiah · chapter 12 · verse 13
Jeremiah 12:13 in Telugu
జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు.
Janulu godhumalu challi mundlapanta koyuduru; vaaru alasata paduchunnaaru gaani prayojanamu lekapoyenu; yehovaa kopaagnivalana kotaku pantaleka meeru siggupaduduru.
Jeremiah 12:13 in English
- King James Version (KJV)
- They have sown wheat, but shall reap thorns: they have put themselves to pain, [but] shall not profit: and they shall be ashamed of your revenues because of the fierce anger of the LORD.
- World English Bible (WEB)
- They have sown wheat, and have reaped thorns. They have exhausted themselves, and profit nothing. You will be ashamed of your fruits, because of the LORD’s fierce anger.”
- American Standard Version (ASV)
- They have sown wheat, and have reaped thorns; they have put themselves to pain, and profit nothing: and ye shall be ashamed of your fruits, because of the fierce anger of Jehovah.
- Bible in Basic English (BBE)
- Though good grain was planted, they have got in thorns: they have given themselves pain without profit: they will be shamed on account of their produce, because of the burning wrath of the Lord.
- Darby Translation (DBY)
- They have sown wheat, and they reap thorns; they have put themselves to pain, [and] do not profit. Be ye therefore ashamed of your revenues, because of the fierce anger of Jehovah.
- Webster's Bible (WBS)
- They have sown wheat, but shall reap thorns: they have put themselves to pain, [but] shall not profit; and they shall be ashamed of your revenues because of the fierce anger of the LORD.
- Young's Literal Translation (YLT)
- They sowed wheat, and have thorns reaped, They have become sick — they profit not, And they have been ashamed of your increases, Because of the fierceness of the anger of Jehovah.
Read in context
- 11వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను.
- 12పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.
- 13జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు.
- 14నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును.
- 15వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడు దును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును.
Cross references
- Micah 6:15 మీకా 6:15నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొన కయు ద్రాక్షారసము పానముచేయకయు ఉందువు.
- Leviticus 26:16 లేవీయకాండము 26:16నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;
- Haggai 1:6 హగ్గయి 1:6మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
- Deuteronomy 28:38 ద్వితీయోపదేశకాండము 28:38విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.
- Isaiah 55:2 యెషయా 55:2ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.
- Jeremiah 25:37–38 యిర్మీయా 25:37–38నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను; క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.
- Jeremiah 4:26 యిర్మీయా 4:26నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.
- Habakkuk 2:13 హబక్కూకు 2:13జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.
- Romans 6:21 రోమీయులకు 6:21అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
- Isaiah 30:1–6 యెషయా 30:1–6యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు. ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును. యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.
- Isaiah 31:1–3 యెషయా 31:1–3ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
- Haggai 2:16–17 హగ్గయి 2:16–17నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును. తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.