Jeremiah · chapter 29 · verse 14
Jeremiah 29:14 in Telugu
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
Nannu nenu meeku kanuparachukondunu; ide yehovaa vaakku. Nenu mimmunu cheralonundi rappinchedanu; nenu mimmunu cherapatti ye janulaloniki e sthalamula loniki mimmunu tolivesitino aa janulandarilonundiyu aa sthalamulannitilonundiyu mimmunu samakoorchi rappinchedanu; ide yehovaa vaakku. Echchatanundi mimmunu cherakupampitino achchatike mimmunu marala rappintunu.
Jeremiah 29:14 in English
- King James Version (KJV)
- And I will be found of you, saith the LORD: and I will turn away your captivity, and I will gather you from all the nations, and from all the places whither I have driven you, saith the LORD; and I will bring you again into the place whence I caused you to be carried away captive.
- World English Bible (WEB)
- I will be found by you,” says the LORD, “and I will turn again your captivity, and I will gather you from all the nations, and from all the places where I have driven you,” says the LORD. “I will bring you again to the place from where I caused you to be carried away captive.”
- American Standard Version (ASV)
- And I will be found of you, saith Jehovah, and I will turn again your captivity, and I will gather you from all the nations, and from all the places whither I have driven you, saith Jehovah; and I will bring you again unto the place whence I caused you to be carried away captive.
- Bible in Basic English (BBE)
- I will be near you again, says the Lord, and your fate will be changed, and I will get you together from all the nations and from all the places where I had sent you away, says the Lord; and I will take you back again to the place from which I sent you away prisoners.
- Darby Translation (DBY)
- and I will be found of you, saith Jehovah. And I will turn your captivity, and I will gather you from all the nations, and from all the places whither I have driven you, saith Jehovah; and I will bring you again into the place whence I have caused you to be carried away captive.
- Webster's Bible (WBS)
- And I will be found by you, saith the LORD: and I will turn away your captivity, and I will gather you from all the nations, and from all the places whither I have driven you, saith the LORD: and I will bring you again into the place whence I caused you to be carried away captive.
- Young's Literal Translation (YLT)
- And I have been found of you — an affirmation of Jehovah; and I have turned back [to] your captivity, and have gathered you out of all the nations, and out of all the places whither I have driven you — an affirmation of Jehovah — and I have brought you back unto the place whence I removed you.
Read in context
- 12మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
- 13మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,
- 14నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
- 15బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,
- 16సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు
Cross references
- Ezekiel 36:1–38 యెహెజ్కేలు 36:1–38మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగాశేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుశేషించిన అన్యజనులకు అపహాస్యాస్ప దమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థల ములతోను నిర్జనమైన పట్టణములతోను ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులనందరిని బట్టియు, శేషించిన అన్య జనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగుల తోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు అన్య జనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామీ చుట్టునున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చె దరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడై పోయిన పట్టణములు మరల కట్టబడును. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే. నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్ప్రవర్తనచేతను దుష్క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశ ములకు చెదరి పోయిరి. వారు తాము వెళ్లిన స్థలముల లోని జనులయొద్ద చేరగా ఆ జనులువీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అన్యజను లలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును. మీ సకల మైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనులలో కరవును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను. అప్పుడు మీరు మీ దుష్ ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియ లను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు. మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసి కొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రా యేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గు పడుడి. మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయెననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడ ననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడ ననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసి కొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను. నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామకదినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.
- Jeremiah 30:3 యిర్మీయా 30:3రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
- Micah 4:12 మీకా 4:12కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమ కూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొన కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
- Romans 10:20 రోమీయులకు 10:20మరియు యెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
- 2 Chronicles 15:12–15 2 దినవృత్తాంతములు 15:12–15పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదు మనియు పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతో షించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.
- Isaiah 45:19 యెషయా 45:19అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.
- Jeremiah 50:19–20 యిర్మీయా 50:19–20ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను వారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును. ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 50:4–5 యిర్మీయా 50:4–5ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.
- Psalm 32:6 కీర్తనలు 32:6కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
- Jeremiah 30:10 యిర్మీయా 30:10మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
- Jeremiah 50:33–34 యిర్మీయా 50:33–34సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొను చున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.
Original words (Hebrew)
- found · H4672מָצָא mâtsâʼ
- saith · H5002נְאֻם nᵉʼum
- away · H7725שׁוּב shûwb
- captivity · H7622שְׁבוּת shᵉbûwth
- gather · H6908קָבַץ qâbats
- nations · H1471גּוֹי gôwy
- places · H4725מָקוֹם mâqôwm
- driven · H5080נָדַח nâdach
- saith · H5002נְאֻם nᵉʼum
- again · H7725שׁוּב shûwb
- place · H4725מָקוֹם mâqôwm
- captive · H1540גָּלָה gâlâh