Jeremiah · chapter 31 · verse 1
Jeremiah 31:1 in Telugu
యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు.
Yehovaa vaakku ide aa kaalamuna nenu ishraayelu vanshasthulakandariki devudanai yundunu, vaaru naaku prajalai yunduru.
Jeremiah 31:1 in English
- King James Version (KJV)
- At the same time, saith the LORD, will I be the God of all the families of Israel, and they shall be my people.
- World English Bible (WEB)
- “At that time,” says the LORD, “I will be the God of all the families of Israel, and they will be my people.”
- American Standard Version (ASV)
- At that time, saith Jehovah, will I be the God of all the families of Israel, and they shall be my people.
- Bible in Basic English (BBE)
- At that time, says the Lord, I will be the God of all the families of Israel, and they will be my people.
- Darby Translation (DBY)
- At that time, saith Jehovah, will I be the God of all the families of Israel, and they shall be my people.
- Webster's Bible (WBS)
- At the same time, saith the LORD, I will be the God of all the families of Israel, and they shall be my people.
- Young's Literal Translation (YLT)
- At that time, an affirmation of Jehovah, I am for God to all families of Israel, And they — they are to Me for a people.
Read in context
- 1యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు.
- 2యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.
- 3చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
Cross references
- Jeremiah 30:22 యిర్మీయా 30:22అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును.
- Zechariah 13:9 జెకర్యా 13:9ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.
- Isaiah 41:10 యెషయా 41:10నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
- Jeremiah 30:24 యిర్మీయా 30:24తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.
- Romans 11:26–29 రోమీయులకు 11:26–29వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
- Genesis 17:7–8 ఆదికాండము 17:7–8నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
- Jeremiah 3:18 యిర్మీయా 3:18ఆ దినములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.
- Jeremiah 23:6 యిర్మీయా 23:6అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
- Jeremiah 33:7 యిర్మీయా 33:7చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు చున్నాను.
- Jeremiah 32:38 యిర్మీయా 32:38వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
- Zechariah 10:6–7 జెకర్యా 10:6–7నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. ఎఫ్రా యిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టివారు హృదయపూర్వకముగా ఉల్లసించు దురు.
- Jeremiah 30:3 యిర్మీయా 30:3రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.