Jeremiah · chapter 32 · verse 39
Jeremiah 32:39 in Telugu
మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
Mariyu vaarikini vaari kumaarulakunu melu kalugutakai vaaru nityamu naaku bhayapadunatlu nenu vaariki ekahrudayamunu eka maargamunu dayacheyudunu.
Jeremiah 32:39 in English
- King James Version (KJV)
- And I will give them one heart, and one way, that they may fear me for ever, for the good of them, and of their children after them:
- World English Bible (WEB)
- I will give them one heart and one way, that they may fear me forever, for their good and the good of their children after them.
- American Standard Version (ASV)
- and I will give them one heart and one way, that they may fear me for ever, for the good of them, and of their children after them:
- Bible in Basic English (BBE)
- And I will give them one heart and one way, so that they may go on in the worship of me for ever, for their good and the good of their children after them:
- Darby Translation (DBY)
- And I will give them one heart, and one way, that they may fear me all [their] days, for the good of them, and of their children after them.
- Webster's Bible (WBS)
- And I will give them one heart, and one way, that they may fear me for ever, for the good of them, and of their children after them:
- Young's Literal Translation (YLT)
- and I have given to them one heart, and one way, to fear Me all the days, for good to them, and to their sons after them:
Read in context
- 37ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.
- 38వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
- 39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
- 40నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
- 41వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.
Cross references
- Ezekiel 11:19–20 యెహెజ్కేలు 11:19–20వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.
- Acts 4:32 అపొస్తలుల కార్యములు 4:32విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
- John 17:21 యోహాను 17:21వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
- Ezekiel 37:25 యెహెజ్కేలు 37:25మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
- Jeremiah 32:40 యిర్మీయా 32:40నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
- Proverbs 23:17 సామెతలు 23:17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
- Ezekiel 36:26 యెహెజ్కేలు 36:26నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
- Proverbs 14:26–27 సామెతలు 14:26–27యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును
- Deuteronomy 11:18–21 ద్వితీయోపదేశకాండము 11:18–21కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను. ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినము లును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.
- Hebrews 10:20 హెబ్రీయులకు 10:20ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,
- 2 Chronicles 30:12 2 దినవృత్తాంతములు 30:12యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.
- John 14:6 యోహాను 14:6యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.