Jeremiah · chapter 4 · verse 22
Jeremiah 4:22 in Telugu
నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారుమూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.
Naa janulu avivekulu vaaru nannerugaru, vaarumoodhu laina pillalu vaariki teliviledu, keeducheyutaku vaariki teliyunu gaani melu cheyutaku vaariki buddi chaaladu.
Jeremiah 4:22 in English
- King James Version (KJV)
- For my people [is] foolish, they have not known me; they [are] sottish children, and they have none understanding: they [are] wise to do evil, but to do good they have no knowledge.
- World English Bible (WEB)
- “For my people are foolish. They don’t know me. They are foolish children, and they have no understanding. They are skillful in doing evil, but they don’t know how to do good.”
- American Standard Version (ASV)
- For my people are foolish, they know me not; they are sottish children, and they have no understanding; they are wise to do evil, but to do good they have no knowledge.
- Bible in Basic English (BBE)
- For my people are foolish, they have no knowledge of me; they are evil-minded children, without sense, all of them: they are wise in evil-doing, but have no knowledge of doing good.
- Darby Translation (DBY)
- For my people is foolish, they have not known me; they are sottish children, and they have no intelligence; they are wise to do evil, but to do good they have no knowledge.
- Webster's Bible (WBS)
- For my people [are] foolish, they have not known me; they [are] sottish children, and they have no understanding: they [are] wise to do evil, but to do good they have no knowledge.
- Young's Literal Translation (YLT)
- For my people [are] foolish, me they have not known, Foolish sons [are] they, yea, they [are] not intelligent, Wise [are] they to do evil, And to do good they have not known.
Read in context
- 20కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.
- 21నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?
- 22నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారుమూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.
- 23నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
- 24పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
Cross references
- 1 Corinthians 14:20 1 కొరింథీయులకు 14:20సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
- Romans 16:19 రోమీయులకు 16:19మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.
- Jeremiah 5:21 యిర్మీయా 5:21కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.
- Hosea 4:6 హోషేయ 4:6నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మ శాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.
- Romans 3:11 రోమీయులకు 3:11గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
- Romans 1:22 రోమీయులకు 1:22వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
- Hosea 5:4 హోషేయ 5:4తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.
- Micah 2:1 మీకా 2:1మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
- John 16:3 యోహాను 16:3వారు తండ్రిని నన్నును తెలిసికొన లేదు గనుక ఈలాగు చేయుదురు.
- Deuteronomy 32:28 ద్వితీయోపదేశకాండము 32:28వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు.
- Isaiah 6:9–10 యెషయా 6:9–10ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.