Jeremiah · chapter 42 · verse 6
Jeremiah 42:6 in Telugu
మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.
Maaku melu kalugunatlu memu mana devudaina yehovaa maata vinu vaaramai, adi melegaani keedegaani memu aayanayoddaku ninnu pampuvishayamulo mana devudaina yehovaa selavichchu maataku vidheyula magudumu.
Jeremiah 42:6 in English
- King James Version (KJV)
- Whether [it be] good, or whether [it be] evil, we will obey the voice of the LORD our God, to whom we send thee; that it may be well with us, when we obey the voice of the LORD our God.
- World English Bible (WEB)
- Whether it is good, or whether it is bad, we will obey the voice of the LORD our God, to whom we send you; that it may be well with us, when we obey the voice of the LORD our God.”
- American Standard Version (ASV)
- Whether it be good, or whether it be evil, we will obey the voice of Jehovah our God, to whom we send thee; that it may be well with us, when we obey the voice of Jehovah our God.
- Bible in Basic English (BBE)
- If it is good or if it is evil, we will be guided by the voice of the Lord our God, to whom we are sending you; so that it may be well for us when we give ear to the voice of the Lord our God.
- Darby Translation (DBY)
- Whether it be good or whether it be evil, we will hearken unto the voice of Jehovah our God, to whom we send thee; that it may be well with us when we hearken unto the voice of Jehovah our God.
- Webster's Bible (WBS)
- Whether [it be] good, or whether [it be] evil, we will obey the voice of the LORD our God, to whom we send thee; that it may be well with us, when we obey the voice of the LORD our God.
- Young's Literal Translation (YLT)
- Whether good or evil, to the voice of Jehovah our God, to whom we are sending thee, we do hearken; because it is good for us when we hearken to the voice of Jehovah our God.'
Read in context
- 4కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెల విచ్చునదంతయు మీకు తెలియజేతును.
- 5అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాట లేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక.
- 6మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.
- 7పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను గనుక
- 8అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యదిఫతులనందరిని, అల్పులనేమి ఘనుల నేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను
Cross references
- Jeremiah 7:23 యిర్మీయా 7:23ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
- Romans 8:7 రోమీయులకు 8:7ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
- Deuteronomy 5:29 ద్వితీయోపదేశకాండము 5:29వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.
- Deuteronomy 5:33 ద్వితీయోపదేశకాండము 5:33కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞా పించినట్లు చేయుటకు జాగ్రత్తపడవ లెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచుకొనవలెను.
- Deuteronomy 6:2–3 ద్వితీయోపదేశకాండము 6:2–3నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్ని టను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను.
- Isaiah 3:10 యెషయా 3:10మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
- Psalm 81:13–16 కీర్తనలు 81:13–16అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
- Joshua 24:24 యెహోషువ 24:24అందుకు జనులుమన దేవు డైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి.
- Romans 7:7 రోమీయులకు 7:7కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
- Exodus 24:7 నిర్గమకాండము 24:7అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.
- Romans 7:13 రోమీయులకు 7:13ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.
- Psalm 128:2 కీర్తనలు 128:2నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.