Jeremiah · chapter 48 · verse 10
Jeremiah 48:10 in Telugu
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.
Yehovaa kaaryamunu ashraddhagaa cheyuvaadu shaapagrastu dagunu gaaka raktamu odchakunda khaddamu dooyuvaadu shaapagrastu dagunu gaaka.
Jeremiah 48:10 in English
- King James Version (KJV)
- Cursed [be] he that doeth the work of the LORD deceitfully, and cursed [be] he that keepeth back his sword from blood.
- World English Bible (WEB)
- “Cursed is he who does the work of the LORD negligently; and cursed is he who keeps back his sword from blood.
- American Standard Version (ASV)
- Cursed be he that doeth the work of Jehovah negligently; and cursed be he that keepeth back his sword from blood.
- Bible in Basic English (BBE)
- Let him be cursed who does the Lord's work half-heartedly; let him be cursed who keeps back his sword from blood.
- Darby Translation (DBY)
- Cursed be he that doeth the work of Jehovah negligently, and cursed be he that keepeth back his sword from blood!
- Webster's Bible (WBS)
- Cursed [be] he that doeth the work of the LORD deceitfully, and cursed [be] he that keepeth back his sword from blood.
- Young's Literal Translation (YLT)
- Cursed [is] he who is doing the work of Jehovah slothfully, And cursed [is] he Who is withholding his sword from blood.
Read in context
- 8యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.
- 9మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.
- 10యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.
- 11మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
- 12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
Cross references
- 1 Kings 20:42 1 రాజులు 20:42అప్పుడు అతడుయెహోవా సెలవిచ్చునదేమనగానేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింప బడుదురని రాజుతో అనగా
- 1 Samuel 15:3 1 సమూయేలు 15:3కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను.
- 1 Samuel 15:9 1 సమూయేలు 15:9సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి.
- Judges 5:23 న్యాయాధిపతులు 5:23యెహోవా దూత యిట్లనెను మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.
- 2 Kings 13:19 2 రాజులు 13:19అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించినీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టిన యెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
- Numbers 31:14–18 సంఖ్యాకాండము 31:14–18అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను. మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా? ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయ ములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
- Jeremiah 50:25 యిర్మీయా 50:25కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు.
- 1 Samuel 15:13–35 1 సమూయేలు 15:13–35తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలుయెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలుఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్క డివి? అని అడిగెను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితి మనగా సమూయేలునీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలుచెప్పుమనెను. అందుకు సమూయేలునీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపినీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలుఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా సౌలుజనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట లను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కు నట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడు కొనెను. అందుకు సమూయేలునీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రా యేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెనునేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. అందుకు సౌలునేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదు టను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత సమూయేలు అమాలేకీ యులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి - మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా సమూయేలునీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను. సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదు గాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించి నందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను.
- Jeremiah 47:6 యిర్మీయా 47:6యెహోవా ఖడ్గమా, యెంత వరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము.