Jeremiah · chapter 49 · verse 16
Jeremiah 49:16 in Telugu
నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
Neevu bheekarudavu; kondasandulalo nivasinchuvaadaa, parvata shikharamunu svaadheenaparachukonuvaadaa, nee hrudayagarvamu ninnu mosapuchchenu, neevu pakshiraajuvale nee gootini unnata sthalamulo kattukoninanu akkadanundi ninnu krinda padadrosedanu; ide yehovaa vaakku.
Jeremiah 49:16 in English
- King James Version (KJV)
- Thy terribleness hath deceived thee, [and] the pride of thine heart, O thou that dwellest in the clefts of the rock, that holdest the height of the hill: though thou shouldest make thy nest as high as the eagle, I will bring thee down from thence, saith the LORD.
- World English Bible (WEB)
- As for your terror, the pride of your heart has deceived you, O you who dwell in the clefts of the rock, who hold the height of the hill, though you should make your nest as high as the eagle, I will bring you down from there,” says the LORD.
- American Standard Version (ASV)
- As for thy terribleness, the pride of thy heart hath deceived thee, O thou that dwellest in the clefts of the rock, that holdest the height of the hill: though thou shouldest make thy nest as high as the eagle, I will bring thee down from thence, saith Jehovah.
- Bible in Basic English (BBE)
- ... the pride of your heart has been a false hope, O you who are living in the cracks of the rock, keeping your place on the top of the hill: even if you made your living-place as high as the eagle, I would make you come down, says the Lord.
- Darby Translation (DBY)
- Thy terribleness, the pride of thy heart, hath deceived thee, thou that dwellest in the clefts of the rock, that holdest the height of the hill. Though thou shouldest make thy nest high as the eagle, I will bring thee down from thence, saith Jehovah.
- Webster's Bible (WBS)
- Thy terribleness hath deceived thee, [and] the pride of thy heart, O thou that dwellest in the clefts of the rock, that holdest the hight of the hill: though thou shouldst make thy nest as high as the eagle, I will bring thee down from thence, saith the LORD.
- Young's Literal Translation (YLT)
- Thy terribleness hath lifted thee up, The pride of thy heart, O dweller in clefts of the rock, Holding the high place of the height, For thou makest high as an eagle thy nest, From thence I bring thee down, An affirmation of Jehovah.
Read in context
- 14యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.
- 15జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.
- 16నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
- 17ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.
- 18సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.
Cross references
- Isaiah 49:25 యెషయా 49:25యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.
- Amos 9:2 ఆమోసు 9:2వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.
- Job 39:27 యోబు 39:27పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
- Obadiah 1:3–4 ఓబద్యా 1:3–4అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడె వడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
- Proverbs 16:18 సామెతలు 16:18నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
- Proverbs 29:23 సామెతలు 29:23ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
- Isaiah 14:13–15 యెషయా 14:13–15నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
- Isaiah 2:21 యెషయా 2:21దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
- Proverbs 18:21 సామెతలు 18:21జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
- Ezekiel 28:11–19 యెహెజ్కేలు 28:11–19మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.
- Isaiah 25:4–5 యెషయా 25:4–5కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
- Song of Solomon 2:14 పరమగీతము 2:14బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
Original words (Hebrew)
- terribleness · H8606תִּפְלֶצֶת tiphletseth
- deceived · H5377נָשָׁא nâshâʼ
- pride · H2087זָדוֹן zâdôwn
- heart · H3820לֵב lêb
- dwellest · H7931שָׁכַן shâkan
- clefts · H2288חֲגָו chăgâv
- rock · H5553סֶלַע çelaʻ
- holdest · H8610תָּפַשׂ tâphas
- height · H4791מָרוֹם mârôwm
- hill · H1389גִּבְעָה gibʻâh
- nest · H7064קֵן qên
- high · H1361גָּבַהּ gâbahh
- eagle · H5404נֶשֶׁר nesher
- down · H3381יָרַד yârad
- saith · H5002נְאֻם nᵉʼum