Jeremiah · chapter 49 · verse 17
Jeremiah 49:17 in Telugu
ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.
Edomu paadaipovunu, daani maargamuna naduchuvaaru aashcharyapadi daani yidumalanniyu choochi velaakolamu cheyuduru.
Jeremiah 49:17 in English
- King James Version (KJV)
- Also Edom shall be a desolation: every one that goeth by it shall be astonished, and shall hiss at all the plagues thereof.
- World English Bible (WEB)
- “Edom will become an astonishment. Everyone who passes by it will be astonished, and will hiss at all its plagues.
- American Standard Version (ASV)
- And Edom shall become an astonishment: every one that passeth by it shall be astonished, and shall hiss at all the plagues thereof.
- Bible in Basic English (BBE)
- And Edom will become a cause of wonder: everyone who goes by will be overcome with wonder, and make sounds of fear at all her punishments.
- Darby Translation (DBY)
- And Edom shall be an astonishment: every one that goeth by it shall be astonished, and shall hiss, because of all the plagues thereof.
- Webster's Bible (WBS)
- Also Edom shall be a desolation: every one that goeth by it shall be astonished, and shall hiss at all her plagues.
- Young's Literal Translation (YLT)
- And Edom hath been for a desolation, Every passer by her is astonished, And doth hiss because of all her plagues.
Read in context
- 15జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.
- 16నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
- 17ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.
- 18సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.
- 19చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?
Cross references
- Ezekiel 35:7 యెహెజ్కేలు 35:7వచ్చువారును పోవువారును లేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.
- Jeremiah 50:13 యిర్మీయా 50:13యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి ఆహా నీకీగతి పట్టినదా? అందురు
- Jeremiah 49:13 యిర్మీయా 49:13బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
- Jeremiah 18:16 యిర్మీయా 18:16వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
- Jeremiah 51:37 యిర్మీయా 51:37బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.
- 1 Kings 9:8 1 రాజులు 9:8ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
- Ezekiel 25:13 యెహెజ్కేలు 25:13ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
- Lamentations 2:15–16 విలాపవాక్యములు 2:15–16త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
- Isaiah 34:9–15 యెషయా 34:9–15ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరు గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడు కొనును.
- Micah 6:16 మీకా 6:16ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచ రించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుస రించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోవుచున్నాను.
- 2 Chronicles 7:20–21 2 దినవృత్తాంతములు 7:20–21నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొందియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా
- Ezekiel 35:15 యెహెజ్కేలు 35:15ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.