Jeremiah · chapter 51 · verse 1
Jeremiah 51:1 in Telugu
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను.
Yehovaa eelaagu selavichchuchunnaadu idigo nenu babulonu meedikini daanilo kaapuramuchesi naaku virodhamugalechina vaarimeedikini prachandamaina vaayuvunu rappinchedanu.
Jeremiah 51:1 in English
- King James Version (KJV)
- Thus saith the LORD; Behold, I will raise up against Babylon, and against them that dwell in the midst of them that rise up against me, a destroying wind;
- World English Bible (WEB)
- The LORD says: “Behold, I will raise up against Babylon, and against those who dwell in Lebkamai, a destroying wind.
- American Standard Version (ASV)
- Thus saith Jehovah: Behold, I will raise up against Babylon, and against them that dwell in Leb-kamai, a destroying wind.
- Bible in Basic English (BBE)
- The Lord has said: See, I will make a wind of destruction come up against Babylon and against those who are living in Chaldaea;
- Darby Translation (DBY)
- Thus saith Jehovah: Behold, I will raise up against Babylon, and against them that dwell in the heart of those that rise against me, a destroying wind;
- Webster's Bible (WBS)
- Thus saith the LORD; Behold, I will raise up against Babylon, and against them that dwell in the midst of them that rise against me, a destroying wind;
- Young's Literal Translation (YLT)
- Thus said Jehovah: Lo, I am stirring up against Babylon, And the inhabitants of Leb — My withstanders, A destroying wind,
Read in context
- 1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను.
- 2అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు.
- 3విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును
Cross references
- Amos 3:6 ఆమోసు 3:6పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
- Hosea 13:15 హోషేయ 13:15నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును.
- Jeremiah 4:11–12 యిర్మీయా 4:11–12ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.
- Jeremiah 50:21 యిర్మీయా 50:21దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.
- Isaiah 13:3–5 యెషయా 13:3–5నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి యున్నాను. బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.
- Jeremiah 50:24 యిర్మీయా 50:24బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.
- Ezekiel 19:12 యెహెజ్కేలు 19:12అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయ బడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.
- Zechariah 2:8 జెకర్యా 2:8సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
- Jeremiah 50:33 యిర్మీయా 50:33సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొను చున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.
- 2 Kings 19:7 2 రాజులు 19:7అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.
- Jeremiah 50:14–16 యిర్మీయా 50:14–16ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు.
- Acts 9:4 అపొస్తలుల కార్యములు 9:4అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.