Jeremiah · chapter 50 · verse 46
Jeremiah 50:46 in Telugu
బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.
Babulonu pattabaduchunnadanu samaachaaramu vini bhoomi kampinchuchunnadi janamulalo angalaarpu vinabaduchunnadi.
Jeremiah 50:46 in English
- King James Version (KJV)
- At the noise of the taking of Babylon the earth is moved, and the cry is heard among the nations.
- World English Bible (WEB)
- The earth trembles at the noise of the taking of Babylon. The cry is heard among the nations.
- American Standard Version (ASV)
- At the noise of the taking of Babylon the earth trembleth, and the cry is heard among the nations.
- Bible in Basic English (BBE)
- At the cry, Babylon is taken! the earth is shaking, and the cry comes to the ears of the nations.
- Darby Translation (DBY)
- At the sound of the taking of Babylon the earth hath quaked, and the cry is heard among the nations.
- Webster's Bible (WBS)
- At the noise of the taking of Babylon the earth is moved, and the cry is heard among the nations.
- Young's Literal Translation (YLT)
- From the voice: Captured was Babylon, Hath the earth been shaken, And a cry among nations hath been heard!
Read in context
- 44చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదనునన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?
- 45బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు దురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ మొందును.
- 46బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.
Cross references
- Jeremiah 49:21 యిర్మీయా 49:21వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.
- Ezekiel 31:16 యెహెజ్కేలు 31:16అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షములన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.
- Ezekiel 26:18 యెహెజ్కేలు 26:18ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలు చున్నవి.
- Revelation 18:9–19 ప్రకటన 18:9–19దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు - అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోదుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పు కొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.
- Isaiah 14:9–10 యెషయా 14:9–10నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది వారందరు నిన్ను చూచినీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు.
- Ezekiel 32:10 యెహెజ్కేలు 32:10నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.