Jeremiah · chapter 51 · verse 41
Jeremiah 51:41 in Telugu
షేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.
Sheshaku pattabadenu jagat prasiddhamaina pattanamu pattabadenu babulonu janamulaku vismayaaspadamaayenu.
Jeremiah 51:41 in English
- King James Version (KJV)
- How is Sheshach taken! and how is the praise of the whole earth surprised! how is Babylon become an astonishment among the nations!
- World English Bible (WEB)
- “How Sheshach is taken! How the praise of the whole earth is seized! How Babylon has become a desolation among the nations!
- American Standard Version (ASV)
- How is Sheshach taken! and the praise of the whole earth seized! how is Babylon become a desolation among the nations!
- Bible in Basic English (BBE)
- How is Babylon taken! and the praise of all the earth surprised! how has Babylon become a cause of wonder among the nations!
- Darby Translation (DBY)
- How is Sheshach taken! and how is the praise of the whole earth seized! How is Babylon become an astonishment among the nations!
- Webster's Bible (WBS)
- How is Sheshach taken! and how is the praise of the whole earth surprised! how is Babylon become an astonishment among the nations!
- Young's Literal Translation (YLT)
- How hath Sheshach been captured, Yea, caught is the praise of the whole earth, How hath Babylon been for an astonishment among nations.
Read in context
- 39వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్లజేసెదను ఇదే యెహోవా వాక్కు.
- 40గొఱ్ఱెపిల్లలు వధకు పోవునట్లును మేకపోతులును పాట్ఠేళ్లును వధకు పోవునట్లును వారిని వధకు రప్పించెదను.
- 41షేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.
- 42సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.
- 43దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు.
Cross references
- Jeremiah 25:26 యిర్మీయా 25:26సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.
- Isaiah 13:19 యెషయా 13:19అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.
- Jeremiah 49:25 యిర్మీయా 49:25ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ బడెను.
- Daniel 4:22 దానియేలు 4:22రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.
- Isaiah 14:4 యెషయా 14:4నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
- Revelation 18:10–19 ప్రకటన 18:10–19దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు - అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోదుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పు కొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.
- Jeremiah 50:46 యిర్మీయా 50:46బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.
- Daniel 2:38 దానియేలు 2:38ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు
- Deuteronomy 28:37 ద్వితీయోపదేశకాండము 28:37యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.
- Ezekiel 27:35 యెహెజ్కేలు 27:35నిన్ను బట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్న బోవును.
- Jeremiah 50:23 యిర్మీయా 50:23సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.
- 2 Chronicles 7:21 2 దినవృత్తాంతములు 7:21అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొందియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా