Jeremiah · chapter 52 · verse 9
Jeremiah 52:9 in Telugu
వారు రాజును పట్టు కొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబు లోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.
Vaaru raajunu pattu koni hamaatu deshamunandali riblaapattanamuna nunna babu lonu raajunoddaku atani teesikonipogaa atadu achchatane sidkiyaa raajunaku shikshavidhinchenu.
Jeremiah 52:9 in English
- King James Version (KJV)
- Then they took the king, and carried him up unto the king of Babylon to Riblah in the land of Hamath; where he gave judgment upon him.
- World English Bible (WEB)
- Then they took the king, and carried him up to the king of Babylon to Riblah in the land of Hamath; and he pronounced judgment on him.
- American Standard Version (ASV)
- Then they took the king, and carried him up unto the king of Babylon to Riblah in the land of Hamath; and he gave judgment upon him.
- Bible in Basic English (BBE)
- Then they made the king a prisoner and took him up to the king of Babylon to Riblah in the land of Hamath to be judged.
- Darby Translation (DBY)
- And they took the king, and brought him up to the king of Babylon, unto Riblah in the land of Hamath, and he pronounced judgment upon him.
- Webster's Bible (WBS)
- Then they took the king, and carried him to the king of Babylon to Riblah in the land of Hamath; where he gave judgment upon him.
- Young's Literal Translation (YLT)
- and they capture the king, and bring him up unto the king of Babylon to Riblah, in the land of Hamath, and he speaketh with him — judgments.
Read in context
- 7పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారి పోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.
- 8కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.
- 9వారు రాజును పట్టు కొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబు లోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.
- 10బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి
- 11రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోను నకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.
Cross references
- Numbers 13:21 సంఖ్యాకాండము 13:21కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
- Jeremiah 39:5 యిర్మీయా 39:5అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోనురాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి
- 2 Kings 25:6 2 రాజులు 25:6వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసి కొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.
- Joshua 13:5 యెహోషువ 13:5గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది.
- Jeremiah 32:4–5 యిర్మీయా 32:4–5అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు; మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.
- Numbers 34:11 సంఖ్యాకాండము 34:11షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.
- 2 Chronicles 8:3 2 దినవృత్తాంతములు 8:3తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
- Ezekiel 21:25–27 యెహెజ్కేలు 21:25–27గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది. ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
- 2 Chronicles 33:11 2 దినవృత్తాంతములు 33:11కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొని పోయిరి.
- 2 Kings 23:33 2 రాజులు 23:33ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి
- 1 Kings 8:65 1 రాజులు 8:65మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.