Jeremiah · chapter 7 · verse 25
Jeremiah 7:25 in Telugu
మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.
Mee pitarulu aiguptu deshamulonundi bayaluderi vachchina dinamu modalukoni netivaraku meeru venukadeeyuchu vachchina vaare; nenu anudinamu pendalakada lechi pravaktalaina naa sevakulanandarini mee yoddaku pampuchu vachchitini.
Jeremiah 7:25 in English
- King James Version (KJV)
- Since the day that your fathers came forth out of the land of Egypt unto this day I have even sent unto you all my servants the prophets, daily rising up early and sending [them:]
- World English Bible (WEB)
- Since the day that your fathers came out of the land of Egypt to this day, I have sent to you all my servants the prophets, daily rising up early and sending them.
- American Standard Version (ASV)
- Since the day that your fathers came forth out of the land of Egypt unto this day, I have sent unto you all my servants the prophets, daily rising up early and sending them:
- Bible in Basic English (BBE)
- From the day when your fathers came out of Egypt till this day, I have sent my servants the prophets to you, getting up early every day and sending them:
- Darby Translation (DBY)
- Since the day that your fathers came forth out of the land of Egypt, unto this day, have I sent unto you all my servants the prophets, daily rising up early and sending them;
- Webster's Bible (WBS)
- Since the day that your fathers came forth from the land of Egypt to this day I have even sent to you all my servants the prophets, daily rising early and sending [them] :
- Young's Literal Translation (YLT)
- Even from the day when your fathers Went out of the land of Egypt till this day, I send to you all my servants the prophets, Daily rising early and sending,
Read in context
- 23ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
- 24అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.
- 25మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.
- 26వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.
- 27నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు
Cross references
- Jeremiah 25:4 యిర్మీయా 25:4మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని,
- 2 Chronicles 36:15 2 దినవృత్తాంతములు 36:15వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
- Nehemiah 9:26 నెహెమ్యా 9:26అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.
- Luke 20:10–12 లూకా 20:10–12పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి.
- Ezekiel 2:3 యెహెజ్కేలు 2:3ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.
- Jeremiah 7:13 యిర్మీయా 7:13నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక
- Matthew 21:34–36 మత్తయి 21:34–36పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి. మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
- Ezra 9:7 ఎజ్రా 9:7మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతివిు.
- Psalm 106:13–22 కీర్తనలు 106:13–22అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
- Deuteronomy 9:7 ద్వితీయోపదేశకాండము 9:7అరణ్యములో నీవు నీ దేవు డైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాప కము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశ ములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.
- Jeremiah 32:30–31 యిర్మీయా 32:30–31ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలన వారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదా వారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్ప్రవర్తన అంతటినిబట్టి,
- 1 Samuel 8:7–8 1 సమూయేలు 8:7–8అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు. వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.