Jeremiah · chapter 8 · verse 19
Jeremiah 8:19 in Telugu
యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము విన బడుచున్నది; వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?
Yehovaa seeyo nulo lekapoyenaa? Aame raaju aamelo lekapoyenaa? Ani bahu dooradeshamunundi naa prajala rodanashabdamu vina baduchunnadi; vaari vigrahamula chetanu anyamaina maayaa roopamulachetanu naakela kopamu teppinchiri?
Jeremiah 8:19 in English
- King James Version (KJV)
- Behold the voice of the cry of the daughter of my people because of them that dwell in a far country: [Is] not the LORD in Zion? [is] not her king in her? Why have they provoked me to anger with their graven images, [and] with strange vanities?
- World English Bible (WEB)
- Behold, the voice of the cry of the daughter of my people from a land that is very far off: “Isn’t the LORD in Zion? Isn’t her King in her?” “Why have they provoked me to anger with their engraved images, and with foreign idols?”
- American Standard Version (ASV)
- Behold, the voice of the cry of the daughter of my people from a land that is very far off: is not Jehovah in Zion? is not her King in her? Why have they provoked me to anger with their graven images, and with foreign vanities?
- Bible in Basic English (BBE)
- The voice of the cry of the daughter of my people comes from a far land: Is the Lord not in Zion? is not her King in her? Why have they made me angry with their images and their strange gods which are no gods?
- Darby Translation (DBY)
- Behold the voice of the cry of the daughter of my people, from a very far country: Is not Jehovah in Zion? Is not her king in her? Why have they provoked me to anger with their graven images, with foreign vanities?
- Webster's Bible (WBS)
- Behold the voice of the cry of the daughter of my people because of them that dwell in a distant country: [Is] not the LORD in Zion? [is] not her king in her? Why have they provoked me to anger with their graven images, [and] with strange vanities?
- Young's Literal Translation (YLT)
- Lo, the voice of a cry of the daughter of my people from a land afar off, Is Jehovah not in Zion? is her king not in her? Wherefore have they provoked Me with their graven images, With the vanities of a foreigner?
Read in context
- 17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
- 18నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును?
- 19యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము విన బడుచున్నది; వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?
- 20కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.
- 21నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టియున్నది.
Cross references
- Isaiah 39:3 యెషయా 39:3పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి - ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియాబబులోనను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను.
- Isaiah 13:5 యెషయా 13:5సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.
- Revelation 2:1 ప్రకటన 2:1ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా
- Isaiah 12:6 యెషయా 12:6సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.
- Psalm 149:2 కీర్తనలు 149:2ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.
- Jeremiah 4:30–31 యిర్మీయా 4:30–31దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణ ములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు. ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
- Isaiah 52:1 యెషయా 52:1సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.
- Joel 2:32 యోవేలు 2:32యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.
- Deuteronomy 32:16–21 ద్వితీయోపదేశకాండము 32:16–21వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టిం చిరిహేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు. వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
- Jeremiah 4:16–17 యిర్మీయా 4:16–17ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి. ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 135:21 కీర్తనలు 135:21యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.
- Jeremiah 14:19 యిర్మీయా 14:19నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
Original words (Hebrew)
- voice · H6963קוֹל qôwl
- cry · H7775שַׁוְעָה shavʻâh
- daughter · H1323בַּת bath
- people · H5971עַם ʻam
- far · H4801מֶרְחָק merchâq
- country · H776אֶרֶץ ʼerets
- Zion · H6726צִיּוֹן Tsîyôwn
- king · H4428מֶלֶךְ melek
- anger · H3707כַּעַס kaʻaç
- images · H6456פְּסִיל pᵉçîyl
- strange · H5236נֵכָר nêkâr
- vanities · H1892הֶבֶל hebel