Job · chapter 12 · verse 18
Job 12:18 in Telugu
రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.
Raajula adhikaaramunu aayana kottiveyunu vaari nadumulaku golusulu kattunu.
Job 12:18 in English
- King James Version (KJV)
- He looseth the bond of kings, and girdeth their loins with a girdle.
- World English Bible (WEB)
- He loosens the bond of kings. He binds their waist with a belt.
- American Standard Version (ASV)
- He looseth the bond of kings, And he bindeth their loins with a girdle.
- Bible in Basic English (BBE)
- He undoes the chains of kings, and puts his band on them;
- Darby Translation (DBY)
- He weakeneth the government of kings, and bindeth their loins with a fetter;
- Webster's Bible (WBS)
- He looseth the bond of kings, and girdeth their loins with a girdle.
- Young's Literal Translation (YLT)
- The bands of kings He hath opened, And He bindeth a girdle on their loins.
Read in context
- 16బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు.
- 17ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
- 18రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.
- 19యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
- 20వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
Cross references
- Daniel 2:21 దానియేలు 2:21ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.
- Psalm 116:16 కీర్తనలు 116:16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
- 2 Chronicles 33:11–14 2 దినవృత్తాంతములు 33:11–14కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను. ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.
- Jeremiah 52:31–34 యిర్మీయా 52:31–34యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువదియైదవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహో యాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించి కొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచువచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్య బడుచుండెను.
- Revelation 19:16 ప్రకటన 19:16రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.