Job · chapter 12 · verse 19
Job 12:19 in Telugu
యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
Yaajakulanu vastraheenulanugaa chesi vaarini todukoni povunu sthiramugaa naatukonina vaarini aayana padagottunu.
Job 12:19 in English
- King James Version (KJV)
- He leadeth princes away spoiled, and overthroweth the mighty.
- World English Bible (WEB)
- He leads priests away stripped, and overthrows the mighty.
- American Standard Version (ASV)
- He leadeth priests away stripped, And overthroweth the mighty.
- Bible in Basic English (BBE)
- He makes priests prisoners, overturning those in safe positions;
- Darby Translation (DBY)
- He leadeth priests away spoiled, and overthroweth the mighty;
- Webster's Bible (WBS)
- He leadeth princes away spoiled, and overthroweth the mighty.
- Young's Literal Translation (YLT)
- Causing ministers to go away a spoil And strong ones He overthroweth.
Read in context
- 17ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
- 18రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.
- 19యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
- 20వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
- 21అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
Cross references
- Isaiah 37:36–38 యెషయా 37:36–38అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కు చుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.
- Isaiah 45:1 యెషయా 45:1అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.
- Job 35:9 యోబు 35:9అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.
- 1 Samuel 17:45–46 1 సమూయేలు 17:45–46దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.
- Revelation 17:14 ప్రకటన 17:14వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
- Revelation 19:19–21 ప్రకటన 19:19–21మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
- Job 34:28 యోబు 34:28బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
- Joshua 10:42 యెహోషువ 10:42ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను.
- Joshua 10:24 యెహోషువ 10:24వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.
- Job 24:22 యోబు 24:22ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.