Job · chapter 19 · verse 3
Job 19:3 in Telugu
పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
Padimaarulu meeru nannu nindinchitiri sigguleka meeru nannu baadhinchedaru.
Job 19:3 in English
- King James Version (KJV)
- These ten times have ye reproached me: ye are not ashamed [that] ye make yourselves strange to me.
- World English Bible (WEB)
- You have reproached me ten times. You aren’t ashamed that you attack me.
- American Standard Version (ASV)
- These ten times have ye reproached me: Ye are not ashamed that ye deal hardly with me.
- Bible in Basic English (BBE)
- Ten times now you have made sport of me; it gives you no sense of shame to do me wrong.
- Darby Translation (DBY)
- These ten times have ye reproached me; ye are not ashamed to stupefy me.
- Webster's Bible (WBS)
- These ten times have ye reproached me: ye are not ashamed [that] ye make yourselves strange to me.
- Young's Literal Translation (YLT)
- These ten times ye put me to shame, ye blush not. Ye make yourselves strange to me —
Read in context
- 1అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
- 2ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?
- 3పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
- 4నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?
- 5మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?
Cross references
- Genesis 31:7 ఆదికాండము 31:7మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
- Job 19:17 యోబు 19:17నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
- Job 15:4–6 యోబు 15:4–6నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.
- Job 15:11–12 యోబు 15:11–12దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా? నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?
- Job 18:4–21 యోబు 18:4–21కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్ద నున్న దీపము ఆరిపోవును వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును. భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు. జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు పూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.
- Daniel 1:20 దానియేలు 1:20రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.
- Nehemiah 4:12 నెహెమ్యా 4:12మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చినలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా
- Psalm 69:8 కీర్తనలు 69:8నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.
- Job 4:6–11 యోబు 4:6–11నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా? నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు. సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.
- Genesis 42:7 ఆదికాండము 42:7యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి - మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు - ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.
- Job 8:4–6 యోబు 8:4–6నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
- Numbers 14:22 సంఖ్యాకాండము 14:22నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.