Job · chapter 21 · verse 32
Job 21:32 in Telugu
వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును
Vaaru samaadhiki tebaduduru samaadhi shraddhagaa kaavalikaayabadunu
Job 21:32 in English
- King James Version (KJV)
- Yet shall he be brought to the grave, and shall remain in the tomb.
- World English Bible (WEB)
- Yet he will be borne to the grave. Men will keep watch over the tomb.
- American Standard Version (ASV)
- Yet shall he be borne to the grave, And men shall keep watch over the tomb.
- Bible in Basic English (BBE)
- He is taken to his last resting-place, and keeps watch over it.
- Darby Translation (DBY)
- Yet is he carried to the graves, and watch is kept over the tomb.
- Webster's Bible (WBS)
- Yet he shall be brought to the grave, and shall remain in the tomb.
- Young's Literal Translation (YLT)
- And he — to the graves he is brought. And over the heap a watch is kept.
Read in context
- 30అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
- 31వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు? వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?
- 32వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును
- 33పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.
- 34మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చ జూచెదరు?
Cross references
- Luke 16:22 లూకా 16:22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
- Ezekiel 32:21–32 యెహెజ్కేలు 32:21–32వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అని యందురు; పాతాళ ములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు. అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చి యున్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారు అవమానము నొందుదురు. హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును. అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి. అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధము లను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను. నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి. అక్కడ ఉత్తరదేశపు అధిపతులందురును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితో కూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Psalm 49:14 కీర్తనలు 49:14వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.