Job · chapter 24 · verse 22
Job 24:22 in Telugu
ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
Aayana tana balamuchetanu balavantulanu kaapaaduchunnaadukondaru praanamunugoorchi aasha vidichinanu vaaru marala baagupaduduru.
Job 24:22 in English
- King James Version (KJV)
- He draweth also the mighty with his power: he riseth up, and no [man] is sure of life.
- World English Bible (WEB)
- Yet God preserves the mighty by his power. He rises up who has no assurance of life.
- American Standard Version (ASV)
- Yet [God] preserveth the mighty by his power: He riseth up that hath no assurance of life.
- Bible in Basic English (BBE)
- But God by his power gives long life to the strong; he gets up again, though he has no hope of life.
- Darby Translation (DBY)
- He draweth also the mighty with his power; he riseth up, and no [man] is sure of life.
- Webster's Bible (WBS)
- He draweth also the mighty with his power: he riseth up, and no [man] is sure of life.
- Young's Literal Translation (YLT)
- And hath drawn the mighty by his power, He riseth, and none believeth in life.
Read in context
- 20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
- 21వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలుచేయరు.
- 22ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
- 23ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
- 24వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
Cross references
- Daniel 6:4–9 దానియేలు 6:4–9అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి - రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.
- Revelation 16:13–14 ప్రకటన 16:13–14మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి
- Esther 3:8–10 ఎస్తేరు 3:8–10అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా రాజు తనచేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి
- John 19:12–16 యోహాను 19:12–16ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి. పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పర చిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
- Revelation 17:2 ప్రకటన 17:2భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.