Job · chapter 31 · verse 11
Job 31:11 in Telugu
అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
Adi dushkaamakaaryamu adi nyaayaadhipatulacheta shiksha nondatagina neramu
Job 31:11 in English
- King James Version (KJV)
- For this [is] an heinous crime; yea, it [is] an iniquity [to be punished by] the judges.
- World English Bible (WEB)
- For that would be a heinous crime. Yes, it would be an iniquity to be punished by the judges,
- American Standard Version (ASV)
- For that were a heinous crime; Yea, it were an iniquity to be punished by the judges:
- Bible in Basic English (BBE)
- For that would be a crime; it would be an act for which punishment would be measured out by the judges:
- Darby Translation (DBY)
- For this is an infamy; yea, it is an iniquity [to be judged by] the judges:
- Webster's Bible (WBS)
- For this [is] a hainous crime; yea, it [is] an iniquity [to be punished by] the judges.
- Young's Literal Translation (YLT)
- For it [is] a wicked thing, and a judicial iniquity;
Read in context
- 9నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల
- 10నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.
- 11అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
- 12అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.
- 13నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసిన యెడల
Cross references
- Leviticus 20:10 లేవీయకాండము 20:10పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
- Job 31:28 యోబు 31:28అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
- Deuteronomy 22:22–24 ద్వితీయోపదేశకాండము 22:22–24ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
- Genesis 38:24 ఆదికాండము 38:24రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా - ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.
- Exodus 20:14 నిర్గమకాండము 20:14వ్యభిచరింపకూడదు.
- Proverbs 6:29–33 సామెతలు 6:29–33తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.
- Ezekiel 16:38 యెహెజ్కేలు 16:38జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును.
- Genesis 20:9 ఆదికాండము 20:9అబీమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.
- Genesis 39:9 ఆదికాండము 39:9నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.
- Genesis 26:10 ఆదికాండము 26:10అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.