Job · chapter 31 · verse 28
Job 31:28 in Telugu
అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
Adiyu nyaayaadhipatulacheta shiksha nondatagina nera magunu.
Job 31:28 in English
- King James Version (KJV)
- This also [were] an iniquity [to be punished by] the judge: for I should have denied the God [that is] above.
- World English Bible (WEB)
- this also would be an iniquity to be punished by the judges, for I would have denied the God who is above.
- American Standard Version (ASV)
- This also were an iniquity to be punished by the judges; For I should have denied the God that is above.
- Bible in Basic English (BBE)
- That would have been another sin to be rewarded with punishment by the judges; for I would have been false to God on high.
- Darby Translation (DBY)
- This also would be an iniquity for the judge, for I should have denied the God who is above.
- Webster's Bible (WBS)
- This also [were] an iniquity [to be punished by] the judge: for I should have denied the God [that is] above.
- Young's Literal Translation (YLT)
- It also [is] a judicial iniquity, For I had lied to God above.
Read in context
- 26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
- 27నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
- 28అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
- 29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
- 30నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
Cross references
- Deuteronomy 17:2–7 ద్వితీయోపదేశకాండము 17:2–7నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
- Job 31:11 యోబు 31:11అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
- Psalm 50:6 కీర్తనలు 50:6దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. (సెలా. )
- Job 9:15 యోబు 9:15నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.
- Judges 11:27 న్యాయాధిపతులు 11:27ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక.
- Joshua 24:27 యెహోషువ 24:27జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును.
- Job 23:7 యోబు 23:7అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలనశిక్ష నొందకపోవుదును.
- Deuteronomy 17:9 ద్వితీయోపదేశకాండము 17:9నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థల మునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు.
- Genesis 18:25 ఆదికాండము 18:25ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
- Joshua 24:23 యెహోషువ 24:23అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.
- Jude 1:4 యూదా 1:4ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.
- Hebrews 12:23 హెబ్రీయులకు 12:23పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,