Job · chapter 37 · verse 12
Job 37:12 in Telugu
ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును
Aayanavalana nadipimpabadinavai narulaku nivaasayogya maina bhoogolamu meeda merupunu meghamulunu sanchaaramu cheyunu aayana vaatiki aajnyaapinchunadi yaavattunu avi neraverchunu
Job 37:12 in English
- King James Version (KJV)
- And it is turned round about by his counsels: that they may do whatsoever he commandeth them upon the face of the world in the earth.
- World English Bible (WEB)
- It is turned around by his guidance, that they may do whatever he commands them on the surface of the habitable world,
- American Standard Version (ASV)
- And it is turned round about by his guidance, That they may do whatsoever he commandeth them Upon the face of the habitable world,
- Bible in Basic English (BBE)
- And it goes this way and that, round about, turning itself by his guiding, to do whatever he gives orders to be done, on the face of his world of men,
- Darby Translation (DBY)
- And they are turned every way by his guidance, that they may do whatsoever he commandeth them upon the face of the circuit of the earth,
- Webster's Bible (WBS)
- And it is turned around by his counsels: that they may do whatever he commandeth them upon the face of the world on the earth.
- Young's Literal Translation (YLT)
- And it is turning itself round by His counsels, For their doing all He commandeth them, On the face of the habitable earth.
Read in context
- 10దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
- 11మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
- 12ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును
- 13శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
- 14యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
Cross references
- Psalm 148:8 కీర్తనలు 148:8అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,
- Joel 2:23 యోవేలు 2:23సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును
- James 5:17–18 యాకోబు 5:17–18ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
- Psalm 104:24 కీర్తనలు 104:24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
- Amos 4:7 ఆమోసు 4:7మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురి పించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.
- Revelation 11:6 ప్రకటన 11:6తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
- Jeremiah 14:22 యిర్మీయా 14:22జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.
- Psalm 65:9–10 కీర్తనలు 65:9–10నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.