Job · chapter 8 · verse 5
Job 8:5 in Telugu
నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
Neevu jaagrattagaa devuni vedakinayedala sarvashaktudagu devuni batimaalukoninayedala
Job 8:5 in English
- King James Version (KJV)
- If thou wouldest seek unto God betimes, and make thy supplication to the Almighty;
- World English Bible (WEB)
- If you want to seek God diligently, make your supplication to the Almighty.
- American Standard Version (ASV)
- If thou wouldest seek diligently unto God, And make thy supplication to the Almighty;
- Bible in Basic English (BBE)
- If you will make search for God with care, and put your request before the Ruler of all;
- Darby Translation (DBY)
- If thou seek earnestly unto God, and make thy supplication to the Almighty,
- Webster's Bible (WBS)
- If thou wouldst seek to God betimes, and make thy supplication to the Almighty;
- Young's Literal Translation (YLT)
- If thou dost seek early unto God, And unto the Mighty makest supplication,
Read in context
- 3దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?
- 4నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.
- 5నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
- 6నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
- 7అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
Cross references
- James 4:7–10 యాకోబు 4:7–10కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
- Matthew 7:7–8 మత్తయి 7:7–8అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.
- Job 11:13 యోబు 11:13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల
- Isaiah 55:6–7 యెషయా 55:6–7యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
- Hebrews 3:7–8 హెబ్రీయులకు 3:7–8మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
- 2 Chronicles 33:12–13 2 దినవృత్తాంతములు 33:12–13అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.
- Job 5:8 యోబు 5:8అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
- Job 22:21–30 యోబు 22:21–30ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును. నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.