Job · chapter 5 · verse 8
Job 5:8 in Telugu
అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
Ayite nenu devuni naashrayinchudunu. Devunike naa vyaajyemunu appaginchudunu.
Job 5:8 in English
- King James Version (KJV)
- I would seek unto God, and unto God would I commit my cause:
- World English Bible (WEB)
- “But as for me, I would seek God. I would commit my cause to God,
- American Standard Version (ASV)
- But as for me, I would seek unto God, And unto God would I commit my cause;
- Bible in Basic English (BBE)
- But as for me, I would make my prayer to God, and I would put my cause before him:
- Darby Translation (DBY)
- But as for me I will seek unto God, and unto God commit my cause;
- Webster's Bible (WBS)
- I would seek to God, and to God would I commit my cause:
- Young's Literal Translation (YLT)
- Yet I — I inquire for God, And for God I give my word,
Read in context
- 6శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు.
- 7నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.
- 8అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
- 9ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
- 10ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.
Cross references
- Psalm 50:15 కీర్తనలు 50:15ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
- Job 22:21 యోబు 22:21ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.
- Psalm 37:5 కీర్తనలు 37:5నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
- 2 Chronicles 33:12–13 2 దినవృత్తాంతములు 33:12–13అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.
- 1 Peter 4:19 1 పేతురు 4:19కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
- 1 Peter 2:23 1 పేతురు 2:23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- Job 22:27 యోబు 22:27నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
- 2 Timothy 1:12 2 తిమోతికి 1:12ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
- Job 8:5 యోబు 8:5నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
- Genesis 32:7–12 ఆదికాండము 32:7–12యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.
- Psalm 77:1–2 కీర్తనలు 77:1–2నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.
- Jonah 2:1–7 యోనా 2:1–7ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది. నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు. కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.