John · chapter 10 · verse 7
John 10:7 in Telugu
కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
Kaabatti yesu marala vaarito itlanenu
John 10:7 in English
- King James Version (KJV)
- Then said Jesus unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep.
- World English Bible (WEB)
- Jesus therefore said to them again, “Most certainly, I tell you, I am the sheep’s door.
- American Standard Version (ASV)
- Jesus therefore said unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep.
- Bible in Basic English (BBE)
- So Jesus said again, Truly I say to you, I am the door of the sheep.
- Darby Translation (DBY)
- Jesus therefore said again to them, Verily, verily, I say to you, I am the door of the sheep.
- Webster's Bible (WBS)
- Then said Jesus to them again, Verily, verily, I say to you, I am the door of the sheep.
- Young's Literal Translation (YLT)
- Jesus said therefore again to them, 'Verily, verily, I say to you — I am the door of the sheep;
Read in context
- 5అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
- 6ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.
- 7కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
- 8గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.
- 9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
Cross references
- John 14:6 యోహాను 14:6యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
- Ephesians 2:18 ఎఫెసీయులకు 2:18ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
- John 10:1 యోహాను 10:1గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.
- John 10:9 యోహాను 10:9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
- Ezekiel 34:31 యెహెజ్కేలు 34:31నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Psalm 79:13 కీర్తనలు 79:13అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
- Hebrews 10:19–22 హెబ్రీయులకు 10:19–22సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Psalm 100:3 కీర్తనలు 100:3యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
- Psalm 95:7 కీర్తనలు 95:7రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
- Luke 15:4–6 లూకా 15:4–6మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.
- Isaiah 53:6 యెషయా 53:6మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.