Psalms · chapter 95 · verse 7
Psalm 95:7 in Telugu
రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
Randi namaskaaramu chesi saagilapadudamu manalanu srujinchina yehovaa sannidhini mokarinchudamu nedu meeru aayana maata nangeekarinchinayedala enta melu.
Psalm 95:7 in English
- King James Version (KJV)
- For he [is] our God; and we [are] the people of his pasture, and the sheep of his hand. To day if ye will hear his voice,
- World English Bible (WEB)
- for he is our God. We are the people of his pasture, and the sheep in his care. Today, oh that you would hear his voice!
- American Standard Version (ASV)
- For he is our God, And we are the people of his pasture, and the sheep of his hand. To-day, oh that ye would hear his voice!
- Bible in Basic English (BBE)
- For he is our God; and we are the people to whom he gives food, and the sheep of his flock. Today, if you would only give ear to his voice!
- Darby Translation (DBY)
- For he is our God; and we are the people of his pasture and the sheep of his hand. To-day if ye hear his voice,
- Webster's Bible (WBS)
- For he [is] our God; and we [are] the people of his pasture, and the sheep of his hand. To-day, if ye will hear his voice,
- Young's Literal Translation (YLT)
- For He [is] our God, and we the people of His pasture, And the flock of His hand, To-day, if to His voice ye hearken,
Read in context
- 5సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.
- 6ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
- 7రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
- 8అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
- 9అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
Cross references
- Hebrews 4:7 హెబ్రీయులకు 4:7నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
- Hebrews 3:15 హెబ్రీయులకు 3:15ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
- Revelation 3:20 ప్రకటన 3:20ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
- John 10:14–16 యోహాను 10:14–16నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
- Hebrews 3:7–11 హెబ్రీయులకు 3:7–11మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
- Psalm 48:14 కీర్తనలు 48:14ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.
- 1 Peter 2:25 1 పేతురు 2:25మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.
- Psalm 74:1 కీర్తనలు 74:1దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి?
- Acts 20:28 అపొస్తలుల కార్యములు 20:28దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
- Exodus 15:2 నిర్గమకాండము 15:2యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.
- Psalm 23:1 కీర్తనలు 23:1యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.