Ezekiel · chapter 34 · verse 31
Ezekiel 34:31 in Telugu
నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Naa gorrelunu nenu mepuchunna gorrelu nagu meeru manushyulu, nenu mee devudanu; ide prabhuvaina yehovaa vaakku.
Ezekiel 34:31 in English
- King James Version (KJV)
- And ye my flock, the flock of my pasture, [are] men, [and] I [am] your God, saith the Lord GOD.
- World English Bible (WEB)
- You my sheep, the sheep of my pasture, are men, and I am your God,’ says the Lord GOD.”
- American Standard Version (ASV)
- And ye my sheep, the sheep of my pasture, are men, and I am your God, saith the Lord Jehovah.
- Bible in Basic English (BBE)
- And you are my sheep, the sheep of my grass-lands, and I am your God, says the Lord.
- Darby Translation (DBY)
- And ye, my flock, the flock of my pasture, are men: I [am] your God, saith the Lord Jehovah.
- Webster's Bible (WBS)
- And ye my flock, the flock of my pasture, [are] men, [and] I [am] your God, saith the Lord GOD.
- Young's Literal Translation (YLT)
- And ye, My flock, the flock of My pasture, Men ye [are] — I [am] your God, An affirmation of the Lord Jehovah!'
Read in context
- 29మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.
- 30అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 31నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Cross references
- Psalm 100:3 కీర్తనలు 100:3యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
- John 10:16 యోహాను 10:16ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
- Ezekiel 36:38 యెహెజ్కేలు 36:38నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామకదినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.
- Psalm 78:52 కీర్తనలు 78:52అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను
- Psalm 80:1 కీర్తనలు 80:1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
- Acts 20:28 అపొస్తలుల కార్యములు 20:28దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
- John 20:15–17 యోహాను 20:15–17యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
- John 10:11 యోహాను 10:11నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
- Psalm 95:7 కీర్తనలు 95:7రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
- Isaiah 40:11 యెషయా 40:11గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
- John 10:26–30 యోహాను 10:26–30అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
- Micah 7:14 మీకా 7:14నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వ కాలమున మేసినట్టు మేయుదురు.