John · chapter 12 · verse 43
John 12:43 in Telugu
వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
Vaaru devuni meppukante manushyula meppunu ekkuvagaa apekshinchiri.
John 12:43 in English
- King James Version (KJV)
- For they loved the praise of men more than the praise of God.
- World English Bible (WEB)
- for they loved men’s praise more than God’s praise.
- American Standard Version (ASV)
- for they loved the glory [that is] of men more than the glory [that is] of God.
- Bible in Basic English (BBE)
- For the praise of men was dearer to them than the approval of God.
- Darby Translation (DBY)
- for they loved glory from men rather than glory from God.
- Webster's Bible (WBS)
- For they loved the praise of men more than the praise of God.
- Young's Literal Translation (YLT)
- for they loved the glory of men more than the glory of God.
Read in context
- 41యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.
- 42అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
- 43వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
- 44అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
- 45నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
Cross references
- John 5:44 యోహాను 5:44అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;
- Matthew 23:5–7 మత్తయి 23:5–7మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
- John 5:41 యోహాను 5:41నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.
- Luke 16:15 లూకా 16:15ఆయన మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.
- 2 Corinthians 10:18 2 కొరింథీయులకు 10:18ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.
- 1 Thessalonians 2:6 1 థెస్సలొనీకయులకు 2:6మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.
- Luke 19:17 లూకా 19:17అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
- 1 Samuel 2:30 1 సమూయేలు 2:30నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
- Matthew 6:2 మత్తయి 6:2కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- John 12:26 యోహాను 12:26ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.
- 1 Peter 1:7–8 1 పేతురు 1:7–8నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,
- 1 Peter 3:4 1 పేతురు 3:4సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.