Luke · chapter 19 · verse 17
Luke 19:17 in Telugu
అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
Atadu bhalaa, manchi daasudaa, neevu ee konchemulo nammakamugaa untivi ganuka padi pattanamula meeda adhikaarivai yundumani vaanito cheppenu.
Luke 19:17 in English
- King James Version (KJV)
- And he said unto him, Well, thou good servant: because thou hast been faithful in a very little, have thou authority over ten cities.
- World English Bible (WEB)
- “He said to him, ‘Well done, you good servant! Because you were found faithful with very little, you shall have authority over ten cities.’
- American Standard Version (ASV)
- And he said unto him, Well done, thou good servant: because thou wast found faithful in a very little, have thou authority over ten cities.
- Bible in Basic English (BBE)
- And he said to him, You have done well, O good servant: because you have done well in a small thing you will have authority over ten towns.
- Darby Translation (DBY)
- And he said to him, Well [done], thou good bondman; because thou hast been faithful in that which is least, be thou in authority over ten cities.
- Webster's Bible (WBS)
- And he said to him, Well, thou good servant: because thou hast been faithful in a very little, have thou authority over ten cities.
- Young's Literal Translation (YLT)
- and he said to him, Well done, good servant, because in a very little thou didst become faithful, be having authority over ten cities.
Read in context
- 15అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
- 16మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
- 17అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
- 18అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
- 19అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
Cross references
- Luke 16:10 లూకా 16:10మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
- Matthew 25:21 మత్తయి 25:21అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను.
- Revelation 2:26–29 ప్రకటన 2:26–29నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
- 1 Samuel 2:30 1 సమూయేలు 2:30నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
- 1 Peter 1:7 1 పేతురు 1:7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
- Genesis 39:4 ఆదికాండము 39:4యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.
- 1 Corinthians 4:5 1 కొరింథీయులకు 4:5కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
- 1 Peter 5:4 1 పేతురు 5:4ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
- Romans 2:29 రోమీయులకు 2:29అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.
- 2 Timothy 2:10 2 తిమోతికి 2:10అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
- Luke 22:30 లూకా 22:30సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.