John · chapter 20 · verse 20
John 20:20 in Telugu
ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
Aayana aalaagu cheppi vaariki tana chetulanu prakkanu choopagaa shishyulu prabhuvunu choochi santoshinchiri.
John 20:20 in English
- King James Version (KJV)
- And when he had so said, he shewed unto them [his] hands and his side. Then were the disciples glad, when they saw the Lord.
- World English Bible (WEB)
- When he had said this, he showed them his hands and his side. The disciples therefore were glad when they saw the Lord.
- American Standard Version (ASV)
- And when he had said this, he showed unto them his hands and his side. The disciples therefore were glad, when they saw the Lord.
- Bible in Basic English (BBE)
- And when he had said this, he let them see his hands and his side. Then the disciples were glad when they saw the Lord.
- Darby Translation (DBY)
- And having said this, he shewed to them his hands and his side. The disciples rejoiced therefore, having seen the Lord.
- Webster's Bible (WBS)
- And when he had so said, he showed to them [his] hands and his side. Then were the disciples glad when they saw the Lord.
- Young's Literal Translation (YLT)
- and this having said, he shewed them his hands and side; the disciples, therefore, rejoiced, having seen the Lord.
Read in context
- 18మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
- 19ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
- 20ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
- 21అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
- 22ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి.
Cross references
- John 16:22 యోహాను 16:22అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.
- Luke 24:39–41 లూకా 24:39–41నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదము లను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.
- John 20:27 యోహాను 20:27తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
- 1 John 1:1 1 యోహాను 1:1జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
- John 16:20 యోహాను 16:20మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Isaiah 25:8–9 యెషయా 25:8–9మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.
- John 19:34 యోహాను 19:34సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
- Matthew 28:8 మత్తయి 28:8వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
Original words (Greek)
- And · G2532καί kaí
- had · G5124τοῦτο toûto
- so · G5124τοῦτο toûto
- said · G2036ἔπω épō
- shewed · G1166δεικνύω deiknýō
- them · G846αὐτός autós
- hands · G5495χείρ cheír
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- side · G4125πλευρά pleurá
- Then · G3767οὖν oûn
- were · G5463χαίρω chaírō
- disciples · G3101μαθητής mathētḗs
- glad · G5463χαίρω chaírō
- saw · G1492εἴδω eídō
- Lord · G2962κύριος kýrios