Jonah · chapter 1 · verse 6
Jonah 1:6 in Telugu
అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను.
Appudu odanaayakudu atani yoddaku vachchi, oyee nidra botaa, neekemivachchinadi? Lechi nee devuni praarthinchumu, manamu chaavakunda aa devudu manayandu kanikarinchu nemo anenu.
Jonah 1:6 in English
- King James Version (KJV)
- So the shipmaster came to him, and said unto him, What meanest thou, O sleeper? arise, call upon thy God, if so be that God will think upon us, that we perish not.
- World English Bible (WEB)
- So the ship master came to him, and said to him, “What do you mean, sleeper? Arise, call on your God! Maybe your God will notice us, so that we won’t perish.”
- American Standard Version (ASV)
- So the shipmaster came to him, and said unto him, What meanest thou, O sleeper? arise, call upon thy God, if so be that God will think upon us, that we perish not.
- Bible in Basic English (BBE)
- And the ship's captain came to him and said to him, What are you doing sleeping? Up! say a prayer to your God, if by chance God will give a thought to us, so that we may not come to destruction.
- Darby Translation (DBY)
- And the shipmaster came to him, and said unto him, What meanest thou, sleeper? arise, call upon thy God; perhaps God will think upon us, that we perish not.
- Webster's Bible (WBS)
- So the ship-master came to him, and said to him, What meanest thou, O sleeper? arise, call upon thy God, it may be that God will think upon us, that we perish not.
- Young's Literal Translation (YLT)
- And the chief of the company draweth near to him, and saith to him, 'What — to thee, O sleeper? rise, call unto thy God, it may be God doth bethink himself of us, and we do not perish.'
Read in context
- 4అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
- 5కాబట్టి నావికులు భయ పడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను
- 6అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను.
- 7అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.
- 8కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా
Cross references
- Jonah 3:9 యోనా 3:9మనుష్యు లందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
- Psalm 107:28–29 కీర్తనలు 107:28–29శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
- Mark 4:37–41 మార్కు 4:37–41అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి - బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను. అప్పుడాయన మీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 2 Samuel 12:22 2 సమూయేలు 12:22అతడుబిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని.
- Ephesians 5:14 ఎఫెసీయులకు 5:14అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
- Psalm 107:12–13 కీర్తనలు 107:12–13ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను
- Amos 5:15 ఆమోసు 5:15కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.
- Acts 21:13 అపొస్తలుల కార్యములు 21:13పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
- Romans 13:11 రోమీయులకు 13:11మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
- Psalm 107:6 కీర్తనలు 107:6వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
- Joel 2:11 యోవేలు 2:11యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
- Psalm 78:34 కీర్తనలు 78:34వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి.