Joshua · chapter 24 · verse 23
Joshua 24:23 in Telugu
అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.
Andukataduaalaagaite mee madhya nunna anyadevatalanu tolagadrosi, ishraayeleeyula devudaina yehovaatattu mee hrudayamunu trippukonudani cheppenu.
Joshua 24:23 in English
- King James Version (KJV)
- Now therefore put away, [said he], the strange gods which [are] among you, and incline your heart unto the LORD God of Israel.
- World English Bible (WEB)
- “Now therefore put away the foreign gods which are among you, and incline your heart to the LORD, the God of Israel.”
- American Standard Version (ASV)
- Now therefore put away, [said he], the foreign gods which are among you, and incline your heart unto Jehovah, the God of Israel.
- Bible in Basic English (BBE)
- Then, he said, put away the strange gods among you, turning your hearts to the Lord, the God of Israel.
- Darby Translation (DBY)
- Now therefore put away the strange gods that are among you, and incline your heart unto Jehovah the God of Israel.
- Webster's Bible (WBS)
- Now therefore put away ([said he] ) the strange gods which [are] among you, and incline your heart to the LORD God of Israel.
- Young's Literal Translation (YLT)
- and, now, turn aside the gods of the stranger which [are] in your midst, and incline your heart unto Jehovah, God of Israel.'
Read in context
- 21జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి.
- 22అప్పుడు యెహో షువమీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారుమేము సాక్షులమే అనిరి.
- 23అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.
- 24అందుకు జనులుమన దేవు డైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి.
- 25అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి
Cross references
- Joshua 24:14 యెహోషువ 24:14కాబట్టి మీరు యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.
- 2 Corinthians 6:16–18 2 కొరింథీయులకు 6:16–18దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
- Proverbs 2:2 సామెతలు 2:2జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల
- Genesis 35:2–4 ఆదికాండము 35:2–4యాకోబు తన యింటివారితోను తన యొద్దనున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.
- 1 Samuel 7:3–4 1 సమూయేలు 7:3–4సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును. అంతట ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవత లను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.
- Judges 10:15–16 న్యాయాధిపతులు 10:15–16అప్పుడు ఇశ్రా యేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
- Hebrews 12:28–29 హెబ్రీయులకు 12:28–29అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
- 1 Kings 8:58 1 రాజులు 8:58తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పిత రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.
- Psalm 119:36 కీర్తనలు 119:36లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.
- Exodus 20:23 నిర్గమకాండము 20:23మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.
- 1 Corinthians 10:19–21 1 కొరింథీయులకు 10:19–21ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.
- Hosea 14:2–3 హోషేయ 14:2–3మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.