Genesis · chapter 35 · verse 2
Genesis 35:2 in Telugu
యాకోబు తన యింటివారితోను తన యొద్దనున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.
Yaakobu tana yintivaaritonu tana yoddanunna vaarandari tonu mee yoddanunna anyadevatalanu paaravesi mimmunu meeru shuchiparachukoni mee vastramulanu maarchukonudi.
Genesis 35:2 in English
- King James Version (KJV)
- Then Jacob said unto his household, and to all that [were] with him, Put away the strange gods that [are] among you, and be clean, and change your garments:
- World English Bible (WEB)
- Then Jacob said to his household, and to all who were with him, “Put away the foreign gods that are among you, purify yourselves, and change your garments.
- American Standard Version (ASV)
- Then Jacob said unto his household, and to all that were with him, Put away the foreign gods that are among you, and purify yourselves, and change your garments:
- Bible in Basic English (BBE)
- Then Jacob said to all his people, Put away the strange gods which are among you, and make yourselves clean, and put on a change of clothing:
- Darby Translation (DBY)
- And Jacob said to his household, and to all that were with him, Put away the strange gods that are among you, and cleanse yourselves, and change your garments;
- Webster's Bible (WBS)
- Then Jacob said to his household, and to all that [were] with him, Put away the strange gods that [are] among you, and be clean, and change your garments:
- Young's Literal Translation (YLT)
- And Jacob saith unto his household, and unto all who [are] with him, 'Turn aside the gods of the stranger which [are] in your midst, and cleanse yourselves, and change your garments;
Read in context
- 1దేవుడు యాకోబుతో - నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా
- 2యాకోబు తన యింటివారితోను తన యొద్దనున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.
- 3మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.
- 4వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.
Cross references
- Exodus 19:14 నిర్గమకాండము 19:14అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకు కొనిరి.
- Exodus 19:10 నిర్గమకాండము 19:10యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని
- Ezekiel 18:31 యెహెజ్కేలు 18:31మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- James 4:8 యాకోబు 4:8దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
- Genesis 18:19 ఆదికాండము 18:19ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
- Hebrews 10:22 హెబ్రీయులకు 10:22మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Joshua 24:23 యెహోషువ 24:23అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.
- Ezekiel 36:25 యెహెజ్కేలు 36:25మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
- 2 Corinthians 7:1 2 కొరింథీయులకు 7:1ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
- Joshua 24:15 యెహోషువ 24:15యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
- 1 Peter 2:1–2 1 పేతురు 2:1–2ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
- Deuteronomy 32:16 ద్వితీయోపదేశకాండము 32:16వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టిం చిరిహేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి