Judges · chapter 9 · verse 27
Judges 9:27 in Telugu
వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా
Vaaru polamulaloniki poyi vaari draaksha pandlanu erukoni vaatini trokki krutajnyataarpanamunu chellinchi tama devatala mandiramuloniki poyi annapaanamulu puchchukonuchu abeemelekunu dooshimpagaa
Judges 9:27 in English
- King James Version (KJV)
- And they went out into the fields, and gathered their vineyards, and trode [the grapes], and made merry, and went into the house of their god, and did eat and drink, and cursed Abimelech.
- World English Bible (WEB)
- They went out into the field, harvested their vineyards, trod the grapes, celebrated, and went into the house of their god and ate and drank, and cursed Abimelech.
- American Standard Version (ASV)
- And they went out into the field, and gathered their vineyards, and trod [the grapes], and held festival, and went into the house of their god, and did eat and drink, and cursed Abimelech.
- Bible in Basic English (BBE)
- And they went out into their fields and got in the fruit of their vines, and when the grapes had been crushed, they made a holy feast and went into the house of their god, and over their food and drink they were cursing Abimelech.
- Darby Translation (DBY)
- And they went out into the fields, and gathered their vineyards, and trode [the grapes], and made rejoicings, and went into the house of their god, and ate and drank, and cursed Abimelech.
- Webster's Bible (WBS)
- And they went out into the fields, and gathered their vineyards, and trod [the grapes] , and made merry, and went into the house of their god, and ate and drank, and cursed Abimelech.
- Young's Literal Translation (YLT)
- and go out into the field, and gather their vineyards, and tread, and make praises, and go into the house of their god, and eat and drink, and revile Abimelech.
Read in context
- 25ఎట్లనగా షెకెము యజ మానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారి నందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను.
- 26ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి.
- 27వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా
- 28ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతని కెందుకు దాసులము కావలెను?
- 29ఈ జనము నా చేతిలో ఉండిన యెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.
Cross references
- Judges 9:4 న్యాయాధిపతులు 9:4అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.
- Luke 17:26–29 లూకా 17:26–29నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
- Luke 12:19–20 లూకా 12:19–20నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- Exodus 32:6 నిర్గమకాండము 32:6మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.
- Isaiah 16:9–10 యెషయా 16:9–10అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను.
- Exodus 32:19 నిర్గమకాండము 32:19అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను.
- Judges 9:46 న్యాయాధిపతులు 9:46షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.
- Daniel 5:1–4 దానియేలు 5:1–4రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షా రసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా
- Isaiah 24:7–9 యెషయా 24:7–9క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను
- 1 Samuel 17:43 1 సమూయేలు 17:43ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.
- Psalm 109:17 కీర్తనలు 109:17శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.
- Judges 16:23 న్యాయాధిపతులు 16:23ఫిలిష్తీయుల సర్దారులుమన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి.
Original words (Hebrew)
- out · H3318יָצָא yâtsâʼ
- fields · H7704שָׂדֶה sâdeh
- gathered · H1219בָּצַר bâtsar
- vineyards · H3754כֶּרֶם kerem
- trode · H1869דָּרַךְ dârak
- made · H6213עָשָׂה ʻâsâh
- merry · H1974הִלּוּל hillûwl
- went · H935בּוֹא bôwʼ
- house · H1004בַּיִת bayith
- god · H430אֱלֹהִים ʼĕlôhîym
- eat · H398אָכַל ʼâkal
- drink · H8354שָׁתָה shâthâh
- cursed · H7043קָלַל qâlal
- Abimelech · H40אֲבִימֶלֶךְ ʼĂbîymelek