Leviticus · chapter 14 · verse 46
Leviticus 14:46 in Telugu
మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Mariyu aa yillu paaduvidichina dinamulanniyu daanilo praveshinchuvaadu saayankaalamuvaraku apavitrudagunu.
Leviticus 14:46 in English
- King James Version (KJV)
- Moreover he that goeth into the house all the while that it is shut up shall be unclean until the even.
- World English Bible (WEB)
- “Moreover he who goes into the house while it is shut up shall be unclean until the evening.
- American Standard Version (ASV)
- Moreover he that goeth into the house all the while that it is shut up shall be unclean until the even.
- Bible in Basic English (BBE)
- And, in addition, anyone who goes into the house at any time, while it is shut up, will be unclean till evening.
- Darby Translation (DBY)
- And he that goeth into the house as long as it is shut up shall be unclean until the even.
- Webster's Bible (WBS)
- Moreover, he that goeth into the house all the while that it is shut up, shall be unclean until the evening.
- Young's Literal Translation (YLT)
- 'And he who is going in unto the house all the days he hath shut it up, is unclean till the evening;
Read in context
- 44అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము.
- 45కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.
- 46మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 47ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.
- 48యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
Cross references
- Numbers 19:21–22 సంఖ్యాకాండము 19:21–22వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరి హార జలమును ముట్టువాడు సాయంకాలమువరకు అప విత్రుడై యుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుష్యులందరు సాయం కాలమువరకు అపవిత్రులై యుందురు.
- Numbers 19:7–10 సంఖ్యాకాండము 19:7–10అప్పుడు ఆ యాజ కుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిర స్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాల మువరకు అపవిత్రుడై యుండును. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి. ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.
- Leviticus 15:5–8 లేవీయకాండము 15:5–8వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
- Leviticus 22:6 లేవీయకాండము 22:6అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.
- Leviticus 11:28 లేవీయకాండము 11:28వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.
- Leviticus 17:15 లేవీయకాండము 17:15మరియు కళే బరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశ మందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయం కాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.
- Leviticus 15:10 లేవీయకాండము 15:10వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
- Leviticus 11:24–25 లేవీయకాండము 11:24–25వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.